Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: సంజూ‌కు నో ఛాన్స్.. నితీష్ రెడ్డి డౌట్! అఫ్గా‌న్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

గాయాలతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు పునరాగమనం చేశారు. అయితే ఈ నలుగురు ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ పేర్కొంది. ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గితేనే జట్టులో కొనసాగుతారని స్పష్టం చేసింది.

అఫ్గాన్ ఆతిథ్యంలో..

జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే రీఎంట్రీ ఇవ్వగా.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. సెప్టెంబర్ 13 నుంచి న్యూఢిల్లీ వేదికగా ఈ మూడు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అఫ్గాన్‌లో క్రికెట్ మైదానాలు లేకపోవడంతో ఆ జట్టు యూఏఈ, భారత్ వేదికగా క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

India Playing XI vs Afghanistan 1st T20I Nitish Kumar Reddy Doubtful No Chance for Sanju Samson

వైభవ్ సూర్యవంశీ కొనసాగేనా..?

తొలి టీ20లో బరిలోకి దిగే భారత తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంజూ శాంసన్ రీఎంట్రీ ఇవ్వడంతో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా కొనసాగిస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వైభవ్‌ను కొనసాగిస్తే సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమవుతాడు. వైభవ్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఒకవేళ వైభవ్, సంజూను ఆడించాలనుకుంటే అభిషేక్ శర్మను తప్పించాల్సి ఉంటుంది. టీమిండియా మేనేజ్‌మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్.. అతని కెప్టెన్సీలో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ కూడా చేరదు: సంజూ శాంసన్

రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్.. అతని కెప్టెన్సీలో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ కూడా చేరదు: సంజూ శాంసన్

ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. శివమ్ దూబే పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో కొనసాగనున్నాడు. టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే నితీష్ రెడ్డి బెంచ్‌కు పరిమితమవుతాడు.

ఇద్దరు స్పిన్నర్లతో ఆడితే మాత్రం వాషింగ్టన్ సుందర్ తప్పుకోవాల్సి ఉంటుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి ఆడనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఆడనున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. బుమ్రాకు రెస్ట్ ఇస్తే అర్ష్‌దీప్ సింగ్‌ బరిలోకి దిగుతాడు.

IND vs AFG: భారత్ జట్టులో దక్కని చోటు.. కృనాల్ పాండ్యా రియాక్షన్ ఇదే!

Also Read

IND vs AFG: భారత్ జట్టులో దక్కని చోటు.. కృనాల్ పాండ్యా రియాక్షన్ ఇదే!

అఫ్గాన్‌తో తొలి టీ20 భారత తుది జట్టు(అంచనా):

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌/వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా*, హర్షిత్ రాణా*

అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్) శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా*, హర్షిత్ రాణా*, నితీష్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్‌*.

Story first published: Wednesday, September 2, 2026, 12:56 [IST]
Other articles published on Sep 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+