Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ సరికాదు.. అతనికివ్వాల్సింది: టీమిండియా మాజీ ఓపెనర్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం సరికాదని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. అతనికి బదులుగా దేశవాళీ స్టార్, సీనియర్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌కు ఈ బాధ్యతలు అప్పగించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ఈస్ట్ జోన్ జట్టులో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఈ టోర్నీలో అతను ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఏంటని కొందరంటే.. మంచి నిర్ణయమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Wasim Jaffer Questions Vaibhav Sooryavanshi s Vice-Captaincy Says His Numbers Aren t Impressive Yet

ఫస్ట్ క్లాస్ రికార్డ్స్ గొప్పగా లేవు..

తాజాగా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన వసీం జాఫర్.. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సెలెక్టర్ల నిర్ణయాన్ని తప్పుబడుతూనే ఈ విషయాన్ని రాద్దాంతం చేయాల్సిన పనిలేదన్నాడు. 'సెలెక్టర్లు వైభవ్‌ సూర్యవంశీకి బహుమతి ఇవ్వాలనుకొని ఉండవచ్చు. కానీ అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణంకాలు అంత గొప్పగా ఏం లేవు. ఈ కోణంలో చూస్తే.. ఈ నిర్ణయం కచ్చితంగా చర్చనీయాంశమవుతుంది. కానీ వైభవ్ సూర్యవంశీ కోణం నుంచి చూస్తే.. ఇది ప్రోత్సాహకరమైన నిర్ణయం.

వైస్ కెప్టెన్సీ ఏంది.. వైభవ్ సూర్యవంశీ భారత కెప్టెన్ అవుతాడు: ఈస్ట్ జోన్ సెలెక్టర్స్

వైస్ కెప్టెన్సీ ఏంది.. వైభవ్ సూర్యవంశీ భారత కెప్టెన్ అవుతాడు: ఈస్ట్ జోన్ సెలెక్టర్స్

ఇది అతనికి కచ్చితంగా మంచి గుర్తింపును తెస్తోంది. కానీ జట్టులో సీనియర్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. అతనికి వైస్ కెప్టెన్సీ ఇస్తే బాగుండేది.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

అభిమన్యు ఈశ్వరన్ 113 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 47.61 సగటుతో 8381 పరుగులు చేశాడు. ఇందులో 36 హాఫ్ సెంచరీలు, 27 శతకాలు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా అతనికి ఉంది.

రాద్దాంతం చేయాల్సిన పని లేదు..

అయితే ఈ విషయాన్ని పెద్దగా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 'వైభవ్ వైస్ కెప్టెన్సీ విషయాన్ని రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇషాన్ కిషన్‌ కెప్టెన్‌గా జట్టును నడిపించబోతున్నాడు. ఎంతో క్రికెట్ ఆడి.. ఇప్పటికే బెంగాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అభిమన్యు ఈశ్వరన్ వంటి అనుభవం కలిగిన ఆటగాడికి వైస్ కప్టెన్సీ ఇచ్చి ఉంటే బాగుండేది.

15 ఏళ్ల వైభవ్‌కు వైస్ కెప్టెన్సీనా.. బుద్దుండాలి: హర్షా భోగ్లే

15 ఏళ్ల వైభవ్‌కు వైస్ కెప్టెన్సీనా.. బుద్దుండాలి: హర్షా భోగ్లే

అదే సమయంలో వైభవ్‌కు ఇది ఒక అదనపు బాధ్యతగా.. అతను ఎదురు చూడాల్సిన విషయంగా భావిస్తున్నా. అతనికి ఆ ప్రతిభ ఉంది. వచ్చే రెండు మూడేళ్లలో అతను సారథిగా ఎదగవచ్చు. అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తీరు చూస్తుంటే అతి త్వరలోనే కెప్టెన్సీ అవకాశాలు వస్తాయనిపిస్తుంది. అతను తప్పకుండా రాణిస్తాడనే నమ్మకం ఉంది. వైస్ కెప్టెన్సీ అతనికి అదనపు ప్రేరణ ఇస్తుందని భావిస్తున్నా.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

ఈస్ట్ జోన్ ఆగస్ట్ 23న బెంగళూరు వేదికగా జరిగే తమ తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్‌తో తలపడనుంది. మరోవైపు ఏదో ఒక రోజు వైభవ్ సూర్యవంశీ భారత కెప్టెన్ అవుతాడని, కెప్టెన్సీ స్కిల్స్ నేర్చుకునేందుకే అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చామని వెస్ట్ జోన్ సెలెక్టర్లు స్పష్టం చేశారు. అభిమన్యు ఈశ్వరన్.. ఇషాన్ కిషన్ కంటే సీనియర్ అని, అలాంటి ఆటగాడు డిప్యూటీగా వ్యవహరించడం సరికాదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Story first published: Saturday, August 1, 2026, 16:40 [IST]
Other articles published on Aug 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+