భారత్‌ది చెత్త బ్యాటింగ్.. బౌలింగ్ పిచ్‌పై ఎలా ఆడాలో తెలియదు: మాజీ క్రికెటర్
టీమిండియా బ్యాటింగ్ విభాగంపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ విమర్శలు గుప్పించాడు. బౌలింగ్ పిచ్‌లపై ఎలా ఆడాలో భారత బ్యాటర్లకు తెలియదన్నాడు. ముఖ్యంగా స్పిన్, స్వింగ్ కండిషన్స్‌లో భారత బ్యాటర్లు తేలిపోతున్నారని అభిప్రాయపడ్డాడు.
పసికూన జపాన్‌తో ఇటీవల జరిగిన ఏకైక టీ20లో భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్లకు 32 పరుగులే చేసింది. బంతి బాగా స్పిన్ కావడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.
ఆలోచన విధానం మారాలి..
ఇదే విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్రస్తావించిన వసీం జాఫర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కాలంలో కఠినమైన పిచ్‌లపై ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. భారత బ్యాటర్ల ఆలోచనా విధానంలో మార్పు అవసరమని వసీం జాఫర్ నొక్కి చెప్పాడు. 'భారత బ్యాటింగ్‌లో ఒక బలహీనత ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్నప్పుడు బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతారు. ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఇదే సమస్య ఎదురైంది.

పిచ్‌పై బంతి కొద్దిగా స్వింగ్ లేదా స్పిన్ అయినా భారత బ్యాటర్లు తడబడుతున్నారు. జపాన్‌తో మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంది. కానీ బంతి ఆరంభంలోనే స్వింగ్ కావడంతో భారత బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. వారు అన్ని పిచ్‌లపైనా ఒకే స్ట్రైక్‌రేట్, దూకుడుతో ఆడాలనుకుంటున్నట్లు అనిపించింది.
పరువు దక్కింది..
కానీ పరిస్థితికి తగ్గట్లు ఆటను మార్చుకోవాలి. ఎప్పుడూ 200 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయాలని అనుకోకూడదు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు లక్ష్యాలను నిర్దేశించే విషయంలో పునరాలోచన చేయాలి. లేకపోతే ఘోర అవమానాలు ఎదురవుతాయి. జపాన్ చేతిలో ఓడితే భారత్ పరువు పోయేది. అది కఠినమైన పిచ్ అయినప్పటికీ భారత్ 2 పరుగులతో గట్టెక్కి పరువు కాపాడుకుంది.
స్పిన్ పిచ్‌లు వద్దు..
భారత్ కూడా ఎక్కువగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లను సిద్దం చేయకూడదు. ఎందుకంటే స్పిన్ వికెట్స్ భారత్‌కుఅనుకూలమైన ఫలితాలు ఇవ్వడం లేదు. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో స్పిన్ పిచ్‌లను తయారు చేసి భారత్ మూల్యం చెల్లించుకుంది. కాబట్టి మూడో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలించే వికెట్లను తయారు చేయాలి.
లేకుంటే భారత బ్యాటర్లపై అదనపు ఒత్తిడి పెంచి.. ప్రత్యర్థి బౌలర్లను అవకాశం ఇచ్చినట్లవుతుంది. తొలి రోజు నుంచే బంతి టర్న్ అయితే.. మనపై మనమే ఒత్తిడి తెచ్చుకున్నట్లు అవుతుంది. అంతేకాకుండా గత బ్యాటర్లు ఆడినంతగా ప్రస్తుత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌ను ఆడలేకపోతున్నారు. కాబట్టి సురక్షితమైన పిచ్‌లను తయారు చేయడం ఉత్తమం.
ఈ రోజుల్లో బ్యాటర్లు ఎక్కువగా రెడ్ బాల్ క్రికెట్ ఆడటం లేదు. కిక్కిరిసిన షెడ్యూల్ కారణంగా ఎక్కువగా వైట్ బాల్ క్రికెట్ ఆడుతున్నారు. దాంతో రెడ్ బాల్ క్రికెట్ ఆడే సమయం దొరకడం లేదు. అంతేకాకుండా మూడు వేర్వేరు ఫార్మాట్లు ఆడుతుండటంతో చాలా తక్కువ సమయం లభిస్తుంది.'అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


