బాబర్ ఆజామ్.. పల్లీ, బఠానీలు అమ్ముకోవడానికి వెళ్లావా?
పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఆ జట్టు మాజీ క్రికెటర్ వసీ అక్రమ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ఆకస్మిక మార్పులపై తనకు సమాచారం లేదని బాబర్ ఆజామ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. 'కెప్టెన్‌గా.. నీకే సమాచారం లేనప్పుడు.. అక్కడ ఏం చేస్తున్నావు? పల్లీ, బఠానీలు అమ్ముకుంటున్నావా? అని ప్రశ్నించాడు.
మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ దారుణంగా విఫలమైంది. మూడు టెస్ట్‌ల్లో చిత్తుగా ఓడి 0-3తో సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ కావడం ఇదే తొలిసారి. అయితే తొలి రెండు టెస్ట్‌ల్లో పాకిస్థాన్ కనీసం 200 పరుగులు కూడా చేయకపోవడంతో పీసీబీ కఠిన నిర్ణయం తీసుకుంది.
కోచ్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై వేటు..
పాకిస్థాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను తప్పించింది. తాత్కలిక టెస్ట్ కోచ్‌గా వైట్‌బాల్ హెడ్ కోచ్ మైక్ హస్సెన్‌ను నియమించింది. అతని సూచనలతో జట్టులో 7 మంది ఆటగాళ్లపై వేటు వేసి కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఈ మార్పులు మెరుగైన ఫలితాన్నే ఇచ్చాయి. ఆఖరి టెస్ట్‌లో ఓడినా పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేసింది.

అయితే జట్టులోని మార్పుల గురించి తనకు సమాచారం లేదని బాబర్ ఆజామ్ మీడియా సమావేశంలో వెల్లడించాడు. తనను సంప్రదించకుండా బోర్డు ఈ నిర్ణయాలు తీసుకుందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలను తాజాగా వసీం అక్రమ్ తప్పుబట్టాడు.
తెలియనప్పుడు అక్కడ ఏం చేస్తున్నావ్..?
కెప్టెన్‌కే తెలియనప్పుడు అక్కడ ఎందుకున్నావని, పల్లీ, బఠానీలు అమ్ముకోవడానికా? అని విమర్శించాడు. 'జట్టు మార్పుల గురించి నాకు తెలియదని బాబర్ ఆజామ్ అంటున్నాడు. అతనికే తెలియకపోతే.. అక్కడ ఏం చేస్తున్నాడు. పల్లీ, బఠానీలు అమ్మడానికి వెళ్లారా? ఒక ఆటగాడికి కెప్టెన్ అండగా నిలబడకపోతే.. ఎవరూ రాణించలేరు.
నేను ఎవర్నీ నిందించాలనుకోవడం లేదు. నా అభిప్రాయం తప్పు కావచ్చు. కానీ బాబర్ ఆజామ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సింది కాదు. ఇదంతా అనవసరం. రెండో టెస్ట్ తర్వాత నేను కేవలం ఆటగాడిగానే కొనసాగుతానని ప్రకటించాల్సింది. ఇదే నా అభిప్రాయం.'అని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్‌లో చాలా మంది ఆ దేశ క్రికెట్ బోర్డును విమర్శించడానికి వెనుకాడుతారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ పీసీబీ ఛైర్మెన్‌గా ఉండటంతో విమర్శలు చేసేందుకు భయపడుతారు. దాంతో బాబర్ ఆజామపైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. బలహీనమైన కెప్టెన్ అని షోయబ్ అక్తర్ అనగా.. పీసీబీ తోలు బొమ్మ బాబర్ ఆజామ్ అని రషీద్ లతీఫ్ విమర్శించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


