Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'పిల్లల ఆట చూసి ఏడవడం మన వంతైంది'.. వైభవ్‌ను చూసి ఏడుస్తున్న పాక్ స్టార్స్!

పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పనితీరుపై, వారి ప్రతిభాన్వేషణ వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 15 ఏళ్ల టీమిండియా యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. పాకిస్తాన్ క్రికెట్లో యువ బ్యాటింగ్ ప్రతిభ కొరతను ఆయన ఎత్తిచూపారు. ఇండియాలో ఐపీఎల్ ద్వారా ఎంతటి అద్భుతమైన యువ బ్యాటర్లు వెలుగులోకి వస్తున్నారో.. దశాబ్థం కాలం పూర్తయినా పీఎస్ఎల్ అటువంటి స్థాయి బ్యాటర్లను ఎందుకు తయారు చేయలేకపోతోందని వసీం అక్రమ్ ప్రశ్నించారు.

వైభవ్ అప్పనంగా క్రెడిట్ కొట్టేసాడు.. బుడ్డోడిని ఆట పట్టించిన ఇషాన్ కిషన్!

వైభవ్ అప్పనంగా క్రెడిట్ కొట్టేసాడు.. బుడ్డోడిని ఆట పట్టించిన ఇషాన్ కిషన్!

పీఎస్ఎప్ పదేళ్ల ప్రయాణం.. బౌలర్లు ఓకే, మరి బ్యాటర్లు ఎక్కడ?
లాహోర్లో మీడియాతో వసీం అక్రమ్ మాట్లాడుతూ .. గత పదేళ్లలో పీఎస్ఎల్ పాకిస్తాన్ జాతీయ జట్టుకు పలువురు నాణ్యమైన బౌలర్లను అందించిందని అంగీకరించారు. అయితే ఒక దశాబ్ధం గడిచినా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలకడగా రాణించగల ఒక్క ప్రతిభావంతుడైన బ్యాటర్‌ను కూడా పీఎస్ఎల్ అందించలేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బేబీ బాస్‌గా పేరొందిన వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే దిగ్గజ బౌలర్లను ఎదుర్కొంటూ నిర్భయంగా ఆడుతున్న తీరును ఆయన మెచ్చుకున్నారు.

Wasim Akram Slams PCB and PSL Praises Indian Prodigy Vaibhav Sooryavanshi demanding focus on club cricket

వయసు విషయంలో పొరపాటు
ఇదే సంభాషణలో వసీం అక్రమ్ వైభవ్ సూర్యవంశీ వయసును 14 ఏళ్లుగా పేర్కొన్నప్పటికీ.. ప్రస్తుతం వైభ వయసు 15 ఏళ్లు. ఆ చిన్న వయసు పొరపాటును పక్కన పెడితే అక్రమ్ సూచించిన అసలు అంశం పాకిస్తాన్ క్రికెట్ కు చాలా కీలకమైనది. చిన్న వయసులోనే అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించి, భవిష్యత్తులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగల యువ బ్యాటింగ్ స్టార్లను వెలికితీయాల్సిన అవసరం పాకిస్తాన్ కు ఎంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.

వావ్ బాబర్.. ఒకే మ్యాచ్‌లో డబుల్ రికార్డు!

Also Read

వావ్ బాబర్.. ఒకే మ్యాచ్‌లో డబుల్ రికార్డు!

క్లబ్ క్రికెట్ పునరుద్దరణకే ప్రాధాన్యత ఇవ్వాలి
పాకిస్తాన్‌లో ప్రతిభను పెంపొందించడానికి కేవలం పీఎస్ఎల్ లీగ్‌పై మాత్రమే ఆధారపడటం సరైన విధానం కాదని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. జాతీయ జట్టులో, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో మెరుగైన ఫలితాలు రావాలంటే ప్రాథమిక స్థాయి నుంచి క్లబ్ క్రికెట్ వ్యవస్థను మెరుగుపరచాలని ఆయన కోరారు. అందుకోసం పీసీబీ వెంటనే కరాచీ, లాహోర్ నగరాల్లో క్లబ్ క్రికెట్ అభివృద్ధి కోసం చెరో 100 మిలియన్ పాకిస్తానీ రూపాయలు(10 కోట్లు) పెట్టుబడి పెట్టాలని.. అప్పుడు నిజమైన క్రికెట్ స్కిల్స్ వెలుగులోకి వస్తాయని ఆయన సూచించారు.

Story first published: Saturday, September 12, 2026, 14:04 [IST]
Other articles published on Sep 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+