వాషింగ్టన్ సుందర్‌కు భారీ క్యాష్ ప్రైజ్ అందజేసిన సీఎం విజయ్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భారీ క్యాష్ ప్రైజ్ అందజేశాడు. ఆసియా గేమ్స్ 2026లో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న వాషింగ్టన్ సుందర్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ.75 లక్షల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. ఈ మేరకు సీఎం విజయ్ వాషింగ్టన్ సుందర్‌కు గురువారం క్యాష్ ప్రైజ్ అందజేశారు.
సుందర్‌కే కాదు.. ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన తమిళనాడు ఆటగాళ్లందరికీ సీఎం విజయ్ నజరానా ప్రకటించారు. స్వర్ణ పతక విజేతలకు రూ.75 లక్షలు, సిల్వర్ మెడలిస్ట్‌లకు రూ.50 లక్షలను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (SDAT)కి చెందిన 'ఎలైట్ స్పోర్ట్స్‌పర్సన్ స్కీమ్' కింద ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపింది.

సుందర్‌తో పాటు 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే రేసులో భారత్‌కు రజత పతకం అందించిన జట్టులోని తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌లతో పాటు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టులోని తమిళనాడు యువ క్రీడాకారిణి జి. కమలిని కూడా సీఎం చేతుల మీదుగా క్యాషి రివార్డ్స్ అందుకున్నారు.
Asia Games 2026 విజేతలకు సీఎం విజయ్ భారీ క్యాష్ ప్రైజ్!
ఆసియా గేమ్స్ 2026లో భారత జట్టు పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2026-27 ఆడేందుకు సిద్దమవుతున్నాడు. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సిరీస్ కోసమే సుందర్‌ను భారత టీ20 జట్టు నుంచి తప్పించారు.
అతని స్థానంలో అవకాశం అందుకున్న నమన్ ధీర్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో సుందర్ వైట్ బాల్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఇక నుంచి సుందర్‌ను కేవలం రెడ్ బాల్ ఫార్మాట్‌కే పరిమితం చేసే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ అన్నాడు.
'వాషింగ్టన్ సుందర్‌కు రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా నమన్ ధీర్ జట్టులోకి వచ్చాడు. ప్రతీ రెండు మ్యాచ్‌లకు గాయపడటం వాషింగ్టన్ సుందర్‌కు అలవాటైపోయింది. ఇప్పుడు అతని స్థానంలో వచ్చిన నమన్ ధీర్.. ఆరంభ మ్యాచ్‌ల్లోనే అదరగొట్టాడు. అద్వితీయమైన ప్రదర్శనతో సుందర్ దారులను మూసేశాడు.
జట్టు నుంచి తప్పించలేని పరిస్థితిని కల్పించాడు. ఇప్పుడు అతన్ని పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పించలేరు. నమన్ ధీర్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇకపై వాషింగ్టన్ సుందర్ కేవలం టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే భారత్ తరఫున ఆడగలడు'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

