Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: నిరాశపర్చిన తెలుగు సైన్యం.. గెలిచింది 12 పతకాలే !

ఆసియా గేమ్స్ 2026లో తెలుగు అథ్లెట్లు తీవ్రంగా నిరాశపర్చారు. భారత్ 85 పతకాలు గెలిచినా.. తెలుగు అథ్లెట్లు మాత్రం చెప్పుకోదగ్గ సంఖ్యలో పతకాలను సాధించలేకపోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహించిందే చాలా తక్కువ అంటే.. అందులో పతకాలు గెలిచిన వారు కూడా తక్కువగానే ఉన్నారు. క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకుంటున్నా.. అవి ఒట్టి మాటలేనని ఆసియా గేమ్స్ 2026తో తేలిపోయింది.

జపాన్‌లోని నగోయా నగరం ఆతిథ్యం ఇచ్చిన ఈ ఆసియా గేమ్స్‌కు ఆదివారం(అక్టోబర్ 4) తెరపడిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి 30కి పైగా క్రీడల్లో 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగగా.. 85 పతకాలే వచ్చాయి. ఇందులో 21 స్వర్ణాలు కాగా.. 27 రజతాలు, 37 కాంస్యాలు ఉన్నాయి. ఇందులో తెలుగు అథ్లెట్లు 6 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో 12 పతకాలే సాధించారు. ఇందులో తెలంగాణ అథ్లెట్లు.. 3 స్వర్ణాలు మాత్రమే సాధించడం గమనార్హం.

Asian Games 2026 Telugu Athletes End Campaign With 12 Medals Including Two From Cricket

క్రికెట్‌లో స్వర్ణం.. బ్యాడ్మింటన్‌లో కాంస్యం..

తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పీవీ సింధు, సాత్విక్‌ సాయిరాజ్‌, ఇషా సింగ్‌, జ్యోతి సురేఖ, జ్యోతి యర్రాజిలు తీవ్రంగా నిరాశపర్చారు. క్రికెటర్లు తిలక్ వర్మ, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి స్వర్ణాలు సాధించగా.. పీవీ సింధు టీమ్ విభాగంలో కాంస్య పతకం సాధించింది.

సింగిల్స్‌లో తీవ్రంగా నిరాశపర్చింది. సాత్విక్‌‌సాయిరాజ్ రంకీరెడ్డి, కిడాంబి శ్రీకాంత్‌లతో కూడిన పురుషుల టీమ్ కాంస్య పతకం గెలిచింది. డబుల్స్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన సాత్విక్‌‌సాయిరాజ్ రంకీరెడ్డి, గాయత్రి గోపీచంద్‌‌లు తీవ్రంగా నిరాశపర్చారు.

ముగిసిన 2026 ఆసియా గేమ్స్.. తదుపరి ఆతిథ్య దేశం ఇదే!

ముగిసిన 2026 ఆసియా గేమ్స్.. తదుపరి ఆతిథ్య దేశం ఇదే!

అదరగొట్టిన ఆర్చర్లు..

ఆర్చరీ విభాగంలో తెలుగు అథ్లెట్లు సత్తా చాటాడు. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణం సాధించింది. తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికితరావు కాంపౌండ్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణాలు సాధించింది. ఈ విజయాలతో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ విభాగంలో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది.

రాజమండ్రికి చెందిన గణేష్‌ మణిరత్నం పురుషుల కాంపౌండ్ టీమ్ ఆర్చరీ విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత కాంపౌండ్ ఆర్చరీ కేటగిరిలో కాంస్య పతకం సాధించాడు. విజయవాడకు చెందిన ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ రీకర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకం, పురుషుల రీకర్వ్ టీమ్ ఈవెంట్‌లో మరో రజత పతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో సెమీఫైనల్ చేరినా పతకం అందుకోలేకపోయాడు.

IND vs WI: అతని కోసం వైభవ్ సూర్యవంశీపై వేటు! వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs WI: అతని కోసం వైభవ్ సూర్యవంశీపై వేటు! వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

అథ్లెటిక్స్‌

విశాఖ ఎక్స్‌ప్రెస్ యర్రాజి జ్యోతి గాయంతో తప్పుకోగా.. మొగిలి వెంకట్రామ్‌ రెడ్డి నిరాశపర్చాడు.


షూటింగ్‌.. ఈ సారి గురి తప్పింది

హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్‌ రజత పతకం సాధించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగం‌లో పతకం సాధించింది. గత ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు సాధించిన ఇషా సింగ్.. ఈసారి మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది.

టేబుల్‌ టెన్నిస్‌‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ మెడలిస్ట్‌, హైదరాబాద్‌ అమ్మాయి ఆకుల శ్రీజ నిరాశపర్చింది. సింగిల్స్‌, డబుల్స్‌, టీమ్‌ ఈవెంట్‌ల్లో పోటీ పడిన ఆమె పతకం సాధించలేకపోయింది.

ఈ-స్పోర్ట్స్‌

ఈ-స్పోర్ట్స్‌లో భారత్‌‌కు ప్రాతినిథ్యం వహించిన సాయికృష్ణ నల్లూరి పతకం సాధించలేకపోయాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయికృష్ణ నల్లూరి పోకీమాన్‌ యునైట్‌ ఈవెంట్‌లో పోటీపడ్డాడు. కానీ ఈ వెంట్‌లో భారత్ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.

Story first published: Tuesday, October 6, 2026, 14:10 [IST]
Other articles published on Oct 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+