Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ క్రికెటర్ల ముందు పాక్ ప్లేయర్లు పనికిరారు: పాకిస్థాన్ దిగ్గజం

భారత క్రికెట్లర్లు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లు పనికిరారని పాకిస్థాన్ దిగ్గజం వకార్ యూనిస్ పరోక్షంగా వెల్లడించాడు. భారత్, ఆటగాళ్లతో కూడిన 11 మంది సభ్యుల జట్టును ఎంపిక చేయమంటే 10 మందిని భారత ఆటగాళ్లనే ఎంచుకున్నాడు. తద్వారా భారత్ ఆటగాళ్ల ముందు పాకిస్థాన్ ప్లేయర్లు వేస్ట్ అని చెప్పకనే చెప్పాడు.

పాకిస్థాన్ దిగ్గజ పేసర్ అయిన వకార్ యూనిస్ ఆ జట్టు తరఫున 87 టెస్ట్‌లు ఆడి 373 వికెట్లు, 262 వన్డేల్లో 416 వికెట్లు పడగొట్టాడు. 54 ఏళ్ల వకార్ యూనిస్ తాజాగా భారత్‌కు చెందిన శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా భారత్-పాక్ క్రికెటర్లతో కూడిన తుది జట్టును ఎంపిక చేయాలని మిశ్రా కోరాడు. ఈ సందర్భంగా ఇరు దేశాల ఆటగాళ్లతో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. కానీ వకార్ యూనిస్ మాత్రం ఒకే ఒక్క పాక్ ఆటగాడిని ఎంచుకున్నాడు.

IND vs NZ: ఆ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: తిలక్ వర్మ

IND vs NZ: ఆ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: తిలక్ వర్మ
Waqar Younis Chooses Indian Legends Over Pakistan Stars in Sachin vs Inzamam Dhoni vs Miandad Debate

ఇంజమామ్ ఉల్ హక్‌ను కాదని సచిన్ టెండూల్కర్‌ను, బాబర్ ఆజామ్ స్థానంలో విరాట్ కోహ్లీ, షాహిన్ అఫ్రిదికి బదులు జస్‌ప్రీత్ బుమ్రా, యూనిస్ ఖాన్‌ను కాదని రాహుల్ ద్రవిడ్, జావేద్ మియాందాద్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ, ఫకార్ జమాన్ ప్లేస్‌లో రోహిత్ శర్మ, మిస్బా ఉల్ హక్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్, మహమ్మద్ అమీర్‌కు బదులు మహమ్మద్ షమీని వకార్ యూనిస్ ఎంచుకున్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడినే విస్మరించిన వకార్ యూనిస్.. అతనికి బదులుగా షాహిద్ అన్వర్‌‌కు అవకాశం ఇచ్చాడు. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ, పాక్ 20 ఏళ్ల సంచలనం సమీర్ మిన్హాస్‌లను ఒకర్ని ఎంచుకోమనగా.. వకార్ యూనిస్ నిరాకరించాడు. తాను ఈ ఇద్దరి ఆటను చూడలేదని చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IND vs NZ: ప్రాక్టీస్‌లో శుభ్‌మన్ గిల్ కణతపై సరికొత్త పరికరం.. అసలు ఏంటిది ఇది?

Also Read

IND vs NZ: ప్రాక్టీస్‌లో శుభ్‌మన్ గిల్ కణతపై సరికొత్త పరికరం.. అసలు ఏంటిది ఇది?

వకార్ యూనిస్ ఎంపిక చేసిన భారత్-పాక్ అత్యుత్తమ జట్టు:

సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, షాహిద్ అన్వర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, మహేంద్ర సింగ్ ధోనీ, వీవీఎస్ లక్ష్మణ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ

Story first published: Thursday, October 29, 2026, 15:09 [IST]
Other articles published on Oct 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+