Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: ఆ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: తిలక్ వర్మ

ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అన్నాడు. తొలి బంతికి భారీ షాట్ ఆడే అవకాశం ఉంటేనే కొడుతానని, లేకుంటే సింగిల్స్ తీసుకుంటానని చెప్పాడు. గతంలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ.. ఇషాన్ కిషన్ రాకతో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న అతను మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగో టీ20 వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పాడు.

IND vs ZIM: నిప్పులు చెరిగిన వైష్ణవి శర్మ.. 131 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే!

IND vs ZIM: నిప్పులు చెరిగిన వైష్ణవి శర్మ.. 131 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే!

అవకాశం ఉంటేనే ఆడుతాను..

'ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో మూడో స్థానంలో దూకుడుగా ఆడేవాడిని. ఇప్పుడు కూడా తొలి బంతికే భారీ షాట్ ఆడే అవకాశం ఉంటేనే ఆడుతాను. లేకుంటే సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను వీలైనంత వరకు ముందుకు తీసుకెళ్తాను. గ్యాప్ షాట్స్ ఆడి బౌండరీలు రాబడుతాను.'అని చెప్పాడు.

Tilak Varma Eyes 5-0 Clean Sweep Says His Focus Is on Taking the Game Deep ahead of 4th T20I

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో తనకు మంచి సమన్వయం ఉందని, మైదానంలో తన సలహాలను అతను స్వీకరిస్తాడని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. 'కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో నాకు మంచి సమన్వయం ఉంది. కెప్టెన్ ఒక్కడే ప్రతీ విషయాన్ని గమనించలేడు. అందుకే ఇద్దరం తరుచూ మాట్లాడుకుంటాం. నేను ఏ విషయాల్లో సాయం చేయగలనో చర్చిస్తాను. అవసరమైనప్పుడు శ్రేయస్ కూడా నా సలహాలను తీసుకుంటాడు. మైదానంలో చిన్న చిన్న బాధ్యతలు పంచుకోవడం నాకు బాగా నచ్చింది.'అని తిలక్ వర్మ పేర్కొన్నాడు.

IND vs ZIM: ప్రతీకా,షెఫాలీ విధ్వంసం.. భారత్ ఘన విజయం!

Also Read

IND vs ZIM: ప్రతీకా,షెఫాలీ విధ్వంసం.. భారత్ ఘన విజయం!

సాకులు చెప్పకూడదు..

న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. జట్టుకు ఇచ్చిన సందేశాన్ని కూడా తిలక్ వర్మ గుర్తు చేసుకున్నాడు. ఇది సుదీర్ఘ పర్యటన అని, టీ20 సిరీస్ ఫలితాలు వన్డేలు, టెస్ట్ సిరీస్‌లకూ ఊపునిస్తాయని గంభీర్ తమతో అన్నాడని తిలక్ తెలిపాడు. ప్రయాణాలు, వరుస మ్యాచ్‌లతో అలసట ఉన్నా.. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు సాకులు చెప్పకూడదని తిలక్ వర్మ అభిప్రాయపడ్డాడు.

Story first published: Thursday, October 29, 2026, 12:43 [IST]
Other articles published on Oct 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+