IND vs NZ: ప్రాక్టీస్‌లో శుభ్‌మన్ గిల్ కణతపై సరికొత్త పరికరం.. అసలు ఏంటిది ఇది?
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సన్నదమవుతున్నాడు. ఆక్లాండ్‌లో ఉన్న భారత టీ20 జట్టుతో కలిసిన శుభ్‌మన్ గిల్.. నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేశాడు. సొంతఖర్చులతో ఐదుగురు నెట్ బౌలర్లను అక్కడికి తీసుకెళ్లిన శుభ్‌మన్ గిల్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
అయితే అతని ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోల్లో ఓ వింత పరికరం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. పైగా ఆ పరికరంతోనే శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. దాంతో ఆ పరికరం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
అసలు ఏంటి? ఈ పరికరం..
అయితే అది సరికొత్త ఏఐ ఫిట్‌నెస్ ట్రాకింగ్ పరికరంగా తెలుస్తోంది. ఇంకా మార్కెట్లోకి విడుదల కాని ఈ డివైజ్‌ను శుభ్‌మన్ గిల్ ద్వారా టెస్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శుభ్‌మన్ గిల్ ధరించిన ఈ పరికరం పేరు టెంపుల్. జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ టీమ్ రూపొందించిన ఈ డివైజ్‌ను కణతపై ధరిస్తారు. ఇది ఏఐ సాంకేతికత ద్వారా పని చేస్తుంది. ఆటగాళ్ల శారీరక శ్రమ సమయంలో మెదడుకు రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థ పని తీరు, ఒత్తిడి స్థాయిలను ఇది పర్యవేక్షిస్తుంది.

ఇప్పటికే మార్కెట్‌లో మణికట్టుకు ధరించే బాండ్లు, వాచ్‌లు, ఉంగరాల రూపంలో అనేక ఫిట్‌నెస్ ట్రాకర్లు ఉన్నప్పటికీ,.. ఈ టెంపుల్ డివైజ్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటనేది తెలియడం లేదు. శుభ్‌మన్ గిల్ కంటే ముందు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఈ డివైజ్‌ను ధరించి కనిపించారు.
వన్డే సిరీస్‌కు సన్నదం..
గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో శుభ్‌మన్ గిల్ పూర్తిగా ఈ డివైజ్‌ను ధరించే కనిపించాడు. అతను నెట్స్‌లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌తో కలిసి బ్యాటింగ్ సాధన చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సుదీర్ఘంగా చర్చించాడు. వన్డే సిరీస్ ప్రణాళికల గురించి వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఐదు టీ20ల సిరీస్‌ను 3-0తో ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్.. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా జరిగే నాలుగో టీ20 కోసం సన్నదమవుతోంది.
టీ20 సిరీస్ తరహాలోనే వన్డే సిరీస్ కూడా గెలవాలని గిల్ సేన భావిస్తోంది. ఇప్పటికే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, వన్డే టీమ్‌కు ఎంపికైన ఆటగాళ్లు ఆక్లాండ్ చేరుకున్నారు. వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో న్యూజిలాండ్ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. సౌతాఫ్రికా కండిషన్స్.. న్యూజిలాండ్‌కు దగ్గరగా ఉండటంతో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


