Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా టీ20 కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ ప్రత్యేక నియామకం!

టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం వీవీఎస్ లక్ష్మణ్ టీ20 టీమ్ తాత్కలిక హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు. జింబాబ్వే పర్యటన‌తో పాటు ఆసియా గేమ్స్‌లో పోటీపడే టీమిండియాకు ఈ సొగసరి బ్యాటర్ తాత్కలిక హెడ్ కోచ్‌గా సేవలందించనున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్‌గా కొనసాగుతున్న లక్ష్మణ్.. గతంలోనూ గంభీర్ గైర్హాజరీలో టీమిండియాను పర్యవేక్షించాడు.

MS Dhoni: అభిమానులకు ఎంఎస్ ధోనీ బిగ్ సర్‌ప్రైజ్!

MS Dhoni: అభిమానులకు ఎంఎస్ ధోనీ బిగ్ సర్‌ప్రైజ్!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌‌కు జింబాబ్వే పర్యటనతో పాటు ఆసియా గేమ్స్‌ నుంచి బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. గంభీర్‌తో పాటు అతని సపోర్ట్ స్టాఫ్‌లోని పలువురు ఈ రెండు సిరీస్‌లకు దూరంగా ఉండనున్నాడు. దాంతో లక్ష్మణ్‌తో పాటు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బ్యాటింగ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్ సునీల్ జోషిలు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని యువ జట్టుకు సేవలందించనున్నారు.

VVS Laxman Appointed Head Coach for India s Dual Assignments in Zimbabwe and 2026 Asian Games Amid Packed Schedule

ఇదే తొలిసారి కాదు..

వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు తాత్కలిక కోచ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. 2024 జింబాబ్వే పర్యటనలో, 2023 ఆసియా గేమ్స్‌లో లక్ష్మణ్ భారత జట్టును నడిపించాడు. ఆసియా గేమ్స్ తర్వాత గంభీర్ నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్ తిరిగి తమ బాధ్యతలను చేపట్టనుంది.

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు జులై 9,11 తేదీల్లో ఐదు టీ20ల సిరీస్‌ ముగియనుండగా.. జులై 14, 16, 19 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జులై 23 నుంచి అక్కడ మూడు టీ20ల సిరీస్ జరగనుంది.

IND vs ENG: చిత్తుగా ఓడిన టీమిండియా..!

IND vs ENG: చిత్తుగా ఓడిన టీమిండియా..!

కిక్కిరిసిన షెడ్యూల్‌తో..

వెనువెంటనే సిరీస్‌లు ఉండటంతో గంభీర్‌కు విశ్రాంతి కల్పించారు. ఆ బాధ్యతలను వీవీఎస్ లక్ష్మణ్‌కు అప్పగించారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. సెప్టెంబర్ 13 నుంచి 19 వరకు అఫ్గానిస్థాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుండగా.. సెప్టెన్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు వెస్టిండీస్‌తో జరగనున్న 3 వన్డేలు, 5 టీ20లతో కూడిన వైట్‌బాల్ సిరీస్‌లకు గౌతమ్ గంభీర్ కోచ్‌గా తిరిగి రానున్నాడు.

Story first published: Wednesday, July 8, 2026, 10:26 [IST]
Other articles published on Jul 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+