Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: అభిమానులకు ఎంఎస్ ధోనీ బిగ్ సర్‌ప్రైజ్!

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన 45వ పుట్టినరోజును సరికొత్తగా జరుపుకున్నాడు. మంగళవారం(జులై 7) రోజున ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌కు ధోనీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఎంఎస్ ధోనీ స్టేడియానికి చేరుకున్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టాండ్స్‌లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్న ఎంఎస్ ధోని స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై కనిపించగానే.. ఫ్యాన్స్ కేరింతలు, చప్పట్లతో స్టేడియం మారుమోగిపోయింది.

ఈ పర్యటనలో ఎంఎస్ ధోనీ టీమిండియా సపోర్ట్ స్టాఫ్ సభ్యులను కూడా కలిసి ముచ్చటించారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పవర్ ప్లే ముగిసిన అనంతరం కెమెరా కాసేపు ధోనీ వైపు మళ్లింది. చేతిలో కాఫీ పట్టుకుని సరదాగా కాసేపు టీమిండియా సిబ్బందితో ముచ్చటించాడు. ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షిస్తున్న ధోనీ ఫోటోను బీసీసీఐ కూడా తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

MS Dhoni Celebrates 45th Birthday at IND vs ENG 3rd T20I in Nottingham India Loses Full Details

అయితే ఎంఎస్ ధోనీ హాజరైన ఈ మ్యాచ్‌లో టీమిండియాకు తీవ్ర నిరాశే ఎదురైంది. మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇందులో ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు ఈ సిరీస్ ను కనీసం డ్రా చేసుకోవాలన్నా భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది.

టీమిండియా బ్యాటర్ల ఘోర వైఫల్యం కారణంగా టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా టీమిండియాకు ఇది అతిపెద్ద పరాజయంగా నమోదైంది. అంతకు ముందు 2019లో న్యూజిలాండ్ జట్టుపై 80 పరుగుల తేడాతో ఓడిపోవడమే ఇప్పటివరకు పెద్ద ఓటమిగా ఉండేది. అంతే కాకుండా టీ20ల్లో భారత్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. 2008లో ఆస్ట్రేలియాపై భారత జట్టు 74 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇప్పుడు 76 పరుగులతో రెండో అత్యల్ప స్కోరును నమోదు చేసింది.

Story first published: Wednesday, July 8, 2026, 10:00 [IST]
Other articles published on Jul 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+