Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: చిత్తుగా ఓడిన టీమిండియా..!

ఇంగ్లండ్ పర్యటనలోనూ టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లోనూ టీమిండియా చిత్తయ్యింది. నాటింగ్ హోమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 125 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. మరోసారి చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా మూల్యం చెల్లించుకుంది.

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది బుడ్డోడి అసలు సినిమా: అశ్విన్

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది బుడ్డోడి అసలు సినిమా: అశ్విన్

72 పరుగులకే ఆలౌట్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సామ్ కరణ్(24 బంతుల్లో 4 ఫోర్లతో 41 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్(2/30), హర్షిత్ రాణా(2/40) రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.

IND vs ENG Jofra Archer and Josh Tongue Star as Dominant England Crush India by 125 Runs in 3rd T20I

అనంతరం భారత్ 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్(13), వైభవ్ సూర్యవంశీ(13), అభిషేక్ శర్మ(10), అక్షర్ పటేల్(10) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/29) మూడు వికెట్లు తీయగా.. జోష్ టంగ్(4/28) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఆదిల్ రషీద్(2/14) రెండు వికెట్లు తీయగా.. విల్ జాక్స్(1/5) ఒక వికెట్ పడగొట్టాడు. టీ20 చరిత్రలోనే టీమిండియాకు ఇది ఘోర పరాజయం. గతంలో 100 ప్లస్ రన్స్‌తో భారత్ ఎప్పుడూ ఓడలేదు.

IND vs ENG: అందుకే రవి బిష్ణోయ్‌ను పక్కనపెట్టాం: శ్రేయస్ అయ్యర్

IND vs ENG: అందుకే రవి బిష్ణోయ్‌ను పక్కనపెట్టాం: శ్రేయస్ అయ్యర్

నిప్పులు చెరిగిన ఆర్చర్..

వైభవ్ సూర్యవంశీతో పాటు ఓకే ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌ను ఔట్ చేసి భారత్ పతనాన్ని శాసించిన జోఫ్రా ఆర్చర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్ల స్వింగ్ ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టింది.

టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరాశపర్చాడు. 5 బంతుల్లో 2 భారీ సిక్స్‌లతో 13 పరుగులే చేసి ఆర్చర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ ఓటమితో టీమిండియా సిరీస్ గెలిచే అవకాశాలను కోల్పోయింది. సిరీస్‌ను సమం చేసుకోవాలంటే చివరి రెండు టీ20ల్లో విజయం సాధించాలి. గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టోల్ వేదికగా నాలుగో టీ20 జరగనుంది.

Story first published: Wednesday, July 8, 2026, 7:08 [IST]
Other articles published on Jul 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+