సెహ్వాగ్ కొడుకు అరంగేట్రం.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!
ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో మూడు యూత్ వన్డేల సిరీస్‌లో భారత అండర్ 19 టీమ్ శుభారంభం చేసింది. రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అండర్ 19 టీమ్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్ 19 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
అతనితో పాటు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ కూడా ఈ మ్యాచ్ ఆడాడు. బ్యాటింగ్‌లో ఈ ఇద్దరూ పర్వలేదనిపించారు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను అంపైర్లు 20 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత అండర్ 19 టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది.
ఓపెనర్‌గా సెహ్వాగ్ కొడుకు
తండ్రి తరహాలోనే ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆర్యవీర్ సెహ్వాగ్ 26 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. యశ్‌బర్దాన్ చౌహన్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆన్వయ్ ద్రవిడ్(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38) దూకుడుగా ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎలి బ్రెయిన్, స్పెన్సర్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ బైరోమ్, థామస్ వాసియో చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం ఆస్ట్రేలియా అండర్ 19 టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ జాక్ జోస్నెక్(27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీతో రాణించినా.. నీల్ పటేల్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), హేడెన్ బార్బులోవిక్(24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో యశ్‌బర్ధాన్ చౌహన్(2/28) రెండు వికెట్లు తీయగా.. మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, అర్జున్ రాజ్‌పుత్ తలో వికెట్ తీసారు.
మ్యాచ్‌కు హాజరైన సెహ్వాగ్..
ఈ మ్యాచ్‌కు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ హాజరయ్యాడు. తన కుమారుడు అరంగేట్ర క్యాప్ అందుకోవడం సెహ్వాగ్ ప్రత్యక్షంగా వీక్షించాడు. సెహ్వాగ్‌కు ఇద్దరు కుమారులు కాగా.. ఈ ఇద్దరూ క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. రాహుల్ ద్రవిడ్ ఇద్దరులు కుమారులు కూడా క్రికెటర్లుగా రాణిస్తున్నారు. పెద్ద కుమారుడు సమిత్ పేస్ ఆల్‌రౌండర్. అతను ఇప్పటికే భారత్ అండర్ 19 టీమ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటికే 20 ఏళ్ల పూర్తి చేసుకోవడంతో భారత అండర్ 19 జట్టులో చోటు కోల్పోయాడు.
సెహ్వాగ్ పెద్ద కొడుకు ఆర్యవీర్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. వచ్చే ఏడాది అతను 20 ఏళ్లు పూర్తి చేసుకోనుండటంతో 2028 అండర్ 19 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. 17 ఏళ్ల అన్వే ద్రవిడ్, ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్ 19 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


