Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాటే బ్యాటింగ్.. అయ్యను గుర్తు చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్! (వీడియో)

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారు పేరైన సెహ్వాగ్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. 1999లో పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన సెహ్వాగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచ్‌లు ఆడాడు.

సెహ్వాగ్ బ్రదర్స్ కెమిస్ట్రీ అదుర్స్.. వీడియో వైరల్!

సెహ్వాగ్ బ్రదర్స్ కెమిస్ట్రీ అదుర్స్.. వీడియో వైరల్!

ఇందులో 38 శతకాలు, 72 హాఫ్ సెంచరీలతో 17253 పరుగులు చేశాడు. ముఖ్యంగా సెహ్వాగ్ తన ఫియర్‌లెస్ అప్రోచ్‌‌, ట్రేడ్ మార్క్‌ స్ట్రోక్ ప్లేతో అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతని లెగసిని వారసుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కొనసాగిస్తున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్‌కు ఆడుతున్న ఆర్యవీర్ సెహ్వాగ్.. తన తండ్రి ట్రేడ్ మార్క్ షాట్స్‌ ఆడి అభిమానులను ఆకట్టుకున్నాడు.

సెహ్వాగ్ ఐకానిక్ షాట్స్ అయిన స్క్వేర్ డ్రైవ్, కవర్ డ్రైవ్ షాట్స్ ఆడి అభిమానుల మనసులను దోచాడు. డీపీఎల్ నిర్వాహకులు సైతం.. తండ్రి, కొడుకుల షాట్స్‌ను పోల్చుతూ వీడియోను షేర్ చేసింది. ఇద్దరి బ్యాటింగ్ స్కిల్స్, టెక్నిక్స్‌ను హైలైట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

గంగూలీ కాదు.. నన్ను ఓపెనర్‌గా మార్చింది అతనే: వీరేంద్ర సెహ్వాగ్

Also Read

గంగూలీ కాదు.. నన్ను ఓపెనర్‌గా మార్చింది అతనే: వీరేంద్ర సెహ్వాగ్

అయితే ఈ టోర్నీలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. 10 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంలో నిలిచింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 232 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ లయన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్(2) తీవ్రంగా నిరాశపర్చాడు.

Story first published: Tuesday, August 25, 2026, 11:35 [IST]
Other articles published on Aug 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+