Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

129 పరుగులకే 7 వికెట్లు.. ఓడాల్సిన వన్డేలో 2 వికెట్లతో గెలిచిన భారత్!

When Zaheer Khan Blast with Bat and Won the Match for India against Australia

హైదరాబాద్: ప్రత్యర్థిగా పటిష్టమైన ఆస్ట్రేలియా.. మూకుమ్మడిగా విఫలమైన భారత టాపార్డర్, మిడిలార్డర్.. 129 రన్స్‌కే ఏడు వికెట్లు.. విజయానికి ఇంకా 65 పరుగులు కావాలి.! క్రీజులోనేమో టెయిలెండర్లు.. ప్రత్యర్థి జట్టులోనేమో బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, బ్రాకెన్ వంటి భీకరమైన బౌలర్లు.! ఈ పరిస్థితుల్లో ఎవరైనా భారత ఓటమి ఖాయమనుకుంటారు. కానీ టీమిండియా గెలిచింది. అనూహ్య రీతిలో అసాధారణ ఆటతీరుతో అద్భుత విజయాన్నందుకుంది.!

బ్యాట్‌తో జహీర్ మెరిసిన వేళ..

బ్యాట్‌తో జహీర్ మెరిసిన వేళ..

2007-08 ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన ఏడో వన్డేలో ఈ అద్భుతం జరిగింది. ఓడాల్సిన మ్యాచ్‌లో టెయిలండర్ల అసాధారణ ఆటతో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత్ సూపర్ విక్టరీని అందుకుంది. ఎంత అద్భుత విజయం అంటే.. ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు, అభిమానులు వరల్డ్ కప్ గెలిచామనే ఫీలింగ్‌లో సంబరాలు చేసుకునేంత. అవును.. దాదాపు ఓటమి ఖాయమనుకున్న ఆ మ్యాచ్‌లో జహీర్ ఖాన్ అద్భుతం చేశాడు. మురళి కార్తీక్ సాయంతో చిరస్మరణీయ విజయాన్నందించాడు.

ఆసీస్ 193 ఆలౌట్

ఆసీస్ 193 ఆలౌట్

ముంబై వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. మురళి కార్తీక్(6/27) బంతితో చెలరేగడంతో ఆసీస్ 41.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో పాంటింగ్(57), మిచెల్ జాన్సన్(24 నాటౌట్) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఎక్స్‌ట్రాల ద్వారానే 33 పరుగులు వచ్చాయి. ఇక కార్తీక్ తోడుగా ఆర్పీ సింగ్ (2/59), జహీర్ ఖాన్(1/22) ఆసీస్ పతనాన్ని శాసించారు.

జడ్డూ నీతో వచ్చే సమస్యే ఇది.. ఔట్ అంటావ్ రివ్యూ తీసుకున్నాక డౌట్ అంటావ్: కోహ్లీ

క్యూకట్టిన భారత బ్యాట్స్‌మన్

క్యూకట్టిన భారత బ్యాట్స్‌మన్

బౌలింగ్‌లో ఆధిపత్యం కనబర్చిన ధోనీ సేన.. బ్యాటింగ్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. స్వల్ప లక్ష్యమే అయినా.. మంచి ఆరంభాన్ని అందుకోలేక.. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది. ఓపెనర్ సౌరవ్ గంగూలీ డకౌట్ అవ్వగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 21 పరుగులకే పరిమితమయ్యాడు. మళ్లీ దినేశ్ కార్తీక్ డకౌట్ కాగా.. యువరాజ్ సింగ్(15), ధోనీ(5) పఠాన్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు.

జహీర్ ఖాన్ సూపర్ బ్యాటింగ్..

ఓవైపు వరుస వికెట్లు కోల్పోతున్నా.. మరోవైపు రాబిన్ ఊతప్ప(47) పోరాడాడు. హర్భజ‌న్ సింగ్(19)‌తో ఇన్నింగ్స్‌ను గాడిన పడేసే ప్రయత్నం చేశాడు. కానీ క్లార్క్ బౌలింగ్‌లో ఊతప్ప ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. హర్భజన్‌ను జాన్సన్ క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో భారత్ 143 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. చేతిలో రెండు వికెట్లు ఉండగా.. టీమిండియా విజయానికి 51 పరుగులు కావాలి. క్రీజులో జహీర్ ఖాన్, కార్తీక్ ఉన్నారు.

భారత్ ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ జహీర్, కార్తీక్ అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. 43 బంతులు ఎదుర్కొన్న జహీర్ 3 ఫోర్లు ఒక సిక్సర్‌తో 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్తీక్ కూడా 34 బంతుల్లో 3 ఫోలర్లు 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్రెట్ లీ స్లెడ్జింగ్‌కు దిగినా అదరని జహీర్ అతనికి సిక్సర్‌తోనే సమాధానం ఇచ్చాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఓ చిరస్మరణీయ విజయంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్ హైలైట్స్ ఇప్పటికీ నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి.

Story first published: Tuesday, July 7, 2020, 15:24 [IST]
Other articles published on Jul 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+