కోహ్లీ, రోహిత్.. క్రికెట్ కంటే గొప్ప కాదు: వీరేంద్ర సెహ్వాగ్
భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే అభిమానులు క్రికెట్ చూడరా? అనే ప్రశ్నకు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అదిరిపోయే సమాధానమిచ్చాడు. కోహ్లీ, రోహిత్.. ఎవరైనా క్రికెట్ కంటే గొప్ప కాదని స్పష్టం చేశాడు. స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో క్రికెట్‌పై అభిమానుల ఆసక్తి తగ్గుతందనే వాదనను సెహ్వాగ్ కొట్టిపారేసాడు. ఆటగాళ్లపై క్రికెట్ ఎప్పుడూ ఆధారపడలేదని, ఆట ఎప్పటికీ గొప్పదేనని స్పష్టం చేశాడు.
అంతర్జాతీయ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నారు. అయితే ఈ ఇద్దరి దిగ్గజాల రిటైర్మెంట్‌తో క్రికెట్‌పై అభిమానులకు ఆసక్తి తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఆట కంటే ఎవరూ గొప్ప కాదు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సెహ్వాగ్ ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. ఎవరు తప్పుకున్నా ఆటపై ఆసక్తి తగ్గదని, అభిమానులు అలా చెప్పినా నమ్మకూడదన్నాడు. 'చాలా మంది ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కోసమో క్రికెట్ చూస్తామని చెబుతుంటారు.

కానీ, ఇలాంటి మాటలు గతంలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ రిటైర్ అయినప్పుడు కూడా వినిపించాయి. అయినా ప్రజలు క్రికెట్ చూడటం ఆపలేదు. గతంలో కంటే ఇప్పుడు క్రికెట్ చూసే వారి సంఖ్య బాగా పెరిగింది.
చూడటం ఎక్కువైంది..
గతంలో కేవలం టీవీల్లో మాత్రమే మ్యాచ్‌లు వచ్చేవి. కానీ, ఇప్పుడు మొబైల్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చాయి. దాంతో మ్యాచ్‌లు చూడటం అభిమానులకు మరింత సులువైంది.నేను రిటైర్ అయ్యాక.. చాలా మంది అభిమానులు నన్ను కలిసి మేము క్రికెట్ చూడటమే మానేశామని చెప్పేవారు. కానీ నేను ఆ మాటలను అస్సలు నమ్మేవాడిని కాదు. ఒక ఆటగాడు రిటైర్ అయితే మేము ఇక క్రికెట్ చూడమని చెప్పేది బహుశా కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ కావచ్చు.
వారు కూడా పూర్తిగా చూడటం మానేయ్యరు. ఏదో కొద్దిగా అయినా ఫాలో అవుతూనే ఉంటారు. పాత ఆటగాళ్లు రిటైర్ అయితే కొత్త ఆటగాళ్లు వస్తూనే ఉంటారు. వ్యక్తుల కంటే ఆటనే కింగ్. ఒకవేళ కేవలం క్రికెటర్ల వల్లే ఆట నడుస్తూ ఉంటే.. అది ఎప్పుడో ఆగిపోయేది.'అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


