Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చహల్.. నీ హెయిర్ స్టైల్ చూసి కుక్కలు వెంటబడ్డాయనుకుంటా: కోహ్లీ

Virat Kohli trolls Yuzvendra Chahal for his new hairstyle

న్యూఢిల్లీ: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షో‌లో చిన్నపిల్లలతో ఇంటరాక్ట్ అయిన విరాట్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తన సహచర ఆటగాడైన చహల్‌పై జోకులు పేల్చాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ ఇద్దరి మధ్య చాలా సరదాగా జరిగిన సంభాషణలో చహల్‌ను కోహ్లీ తన మాటలతో ఆటపట్టించాడు.

చహల్ కటింగ్ ఎవరు చేశారు..?

అతని హెయిర్‌స్టైల్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. చహల్ కటింగ్ చూసి అతని కుక్కలు వెంటబడినట్లున్నాయన్నాడు. ‘చహల్.. నీకు హెయిర్ కటింగ్ ఎవరు చేశారు?'అని విరాట్ ప్రశ్నించగా.. ‘మా దీదీ సాయంతో నేనే చేసుకున్నా'అని ఈ లెగ్ స్పిన్నర్ సమాధానమిచ్చాడు. దీనికి విరాట్ బదులిస్తూ ‘అవునా.. నీ కటింగ్ చూసి మీ కుక్కలు నీ వెంటబడ్డాయనుకుంటా'అని సెటైర్లు పేల్చాడు. దీంతో షోలో పాల్గొన్న పిల్లలతో పాటు అందరూ నవ్వారు.

బుమ్రాను అలా చూసి షాకయ్యా..

బుమ్రాను అలా చూసి షాకయ్యా..

ఇక ఈ లాక్‌డౌన్ కారణంగా చహల్ ఓ జోకర్‌లా మారడని విరాట్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఓపెన్‌గా మాట్లాడటం చూసి తాను ఆశ్చర్యపోయానన్నాడు. ఈ యార్కర్ల కింగ్ సహచరులతో బాగానే మాట్లాడుతాడని,కానీ పబ్లిక్‌లో మాట్లాడాలంటే మాత్రం భయపడతాడని చెప్పుకొచ్చాడు. అలాంటి బుమ్రా.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మనసు విప్పి మాట్లాడటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ఇక తనకు టీమిండియా టాప్ ఫోర్ పేసర్స్ కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడితే చూడాలని ఉందని విరాట్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

ఆ నలుగురు లైవ్ సెషన్ నిర్వహిస్తే..

ఆ నలుగురు లైవ్ సెషన్ నిర్వహిస్తే..

‘ఖచ్చితంగా యుజీ ఓ పెద్ద జోకర్. కానీ జస్ప్రిత్‌లోనే పెద్ద మార్పు కనబడింది. ఇలా అతను పబ్లిక్‌లో మాట్లాడుతాడని నాకు అస్సలు తెలియదు. సహచరులతో మాట్లాడుతాడని తెలుసు కానీ.. ఇలా ప్రపంచం ముందు అన్ని విషయాలను చర్చిస్తాడని అస్సలు ఊహించలేదు. అతని అలా చూడటం ఆశ్యర్యంగా.. బాగా అనిపించింది. భారత టాప్ పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్‌లు లైవ్ వీడియో కాల్‌లో మాట్లాడుతుంటే చూడాలని ఉంది. ఈ నలుగురు జీవితం గురించి చర్చిస్తే వినాలనుంది'అని కోహ్లీ తన కోరికను వెల్లడించాడు.

కరోనా తెచ్చిన కష్టం.. ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారిన ఒలింపిక్ విజేత

చహల్.. నా గిటార్ నీ అంతంటుంది..

చహల్.. నా గిటార్ నీ అంతంటుంది..

ఇక ఈ లాక్‌డౌన్ సమయంలో గిటార్ ప్లే చేయడం ఎలానో నేర్చుకోవడానికి ప్రయత్నించానని, కానీ తనకు అది రాలేదన్నాడు. ‘గిటార్ ప్లే చేయడం ఎలానో నేర్చుకోవడానికి ప్రయత్నించా. కానీ అది చాలా చిన్నగా ఉండటంతో సరిగ్గా నేర్చుకోలేకపోయా. మా ఇంట్లో ఉన్న గిటార్ నీసైజ్ అంత ఉంటుంది'అని విరాట్ చహల్‌కు పంచ్ ఇచ్చాడు.ఇక ఈ లాక్‌డౌన్‌లో తను నేర్చుకున్న కొత్త విషయం ఉదయాన్నే వ్యాయమం చేయడమని ఈ హర్యానా స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. ‘నేను కూడా ఓ కొత్త విషయాన్ని నేర్చుకున్నా. ఈ లాక్‌డౌన్ ఉదయం 6.30కే నిద్రలేదచి వర్కౌట్స్ చేస్తున్నా'అని తెలిపాడు.

మరో బోల్డ్ వీడియోతో.. రగిలిపోవడానికి రెడీగా ఉండాలని ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన షమీ వైఫ్!

Story first published: Friday, May 15, 2020, 13:16 [IST]
Other articles published on May 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+