మరో బోల్డ్ వీడియోతో.. రగిలిపోవడానికి రెడీగా ఉండాలని ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన షమీ వైఫ్!

కోల్‌కతా: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్‌కు అతని ఫ్యాన్స్ మధ్య గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. మోడల్, నటి అయిన ఆమె షమీపై సంచలన ఆరోపణలు చేసి, గృహహింస చట్టం కింద కేసు పెట్టి అతనికి దూరంగా ఉంటుంది. మోడల్ అయిన ఆమె అందుకు తగ్గట్టే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హాట్ హాట్ వీడియోలను షేర్ చేస్తూ తన అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది. తన ఎక్స్‌పోజింగ్‌తో వారిని మైమరిపిస్తోంది. అయితే ఆమె ప్రవర్తనతో విసుగుచెందుతున్న షమీ అభిమానులు హసీన్‌పై మండిపడుతున్నారు.

ఇస్లాంకు విరుద్దంగా..
మతాన్ని ప్రస్తావిస్తూ ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇస్లాం నిబంధనలకు విరుద్దంగా ఇలా డ్యాన్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా హసీన్ వస్త్రదారణపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. స్టార్ పేసర్ అయిన షమీని మానసికంగా వేధించావని, అతనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అతనితో విడిపోయి చిన్నపాపకు తండ్రి దూరం చేశావని మండిపడ్డారు. వెంటనే షమీకి విడాకులు ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే ఇలా మతం, వస్త్రదారణ పేరిట ఆమెపై ట్రోలింగ్‌కు దిగడం ఇదే తొలిసారి కాదు. షమీతో వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో కూడా హసీన్‌పై ఇదే తరహా ట్రోలింగ్ జరిగింది.
కుక్కలు మెరుగుతూనే ఉంటాయ్..
ఈ ట్రోలింగ్‌కు ఏమాత్రం బెదరని హసీన్ మరిన్ని హాట్ వీడియోలను షేర్ చేస్తూనే ఉంది. ఫ్యాన్స్ ప్రస్తావించిన ప్రతీ అంశం ప్రతిబింబించేలా ఈ వీడియోలు ఉన్నాయి. వస్త్రధారణపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఇంకా పొట్టి పొట్టి దుస్తులతో డ్యాన్స్ చేసిన వీడియోలను హసీన్ షేర్ చేస్తుంది. ఇప్పటికే షేర్ చేసిన ఓ వీడియోలో బాలీవుడ్ సినీ తారాలతో చిందేయగా.. మరో వీడియోలో పొట్టి దుస్తులతో ఎక్స్ పోజ్ చేసింది. పైగా ఆవీడియోలకు దిమ్మతిరిగే క్యాప్షన్ ఇచ్చింది. ట్రోలర్స్‌ను అరిచే కుక్కలతో పోలుస్తూ.. కుక్కలు మెరుగుతూనే ఉంటాయని, మనపని మనం చేసుకోవాలని పేర్కొంది.

ఈ సారి మరింత హాట్‌హాట్‌గా..
తాజాగా మరో బోల్డ్ వీడియోతో హసీన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది. తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఆ వీడియోలో తన అందాలన్నిటిని ఎక్స్‌పోజ్ చేసిన జహాన్.. దానికి రెచ్చగొట్టే వ్యాఖ్యను జోడించింది. ‘రగిలిపోవడానికి సిద్దంగా ఉండండి'అని అభిమానులనుద్దేశించి క్యాప్షన్‌గా పేర్కొంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలేని పదాలతో తిడుతున్నారు.
ఇక హసీన్ జహాన్‌ను షమీ ప్రేమించి 2014లో పెళ్లిచేసుకోగా వారికి ఓ పాప ఉంది. నాలుగేళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. అనంతరం నెలకొన్న గొడవలతో ప్రస్తుతం వీరిద్దరు విడిగా ఉంటున్నారు.

షమీపై సంచలన ఆరోపణలు..
రెండేళ్ల క్రితం హాసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షమీ స్త్రీలోలుడని, అతని కుటుంబం తనను అనేక ఇబ్బందులు గురిచేసిందని, లైంగికంగా కూడా వేదించారని ఆరోపించింది. అంతేకాకుండా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలు సమర్పించి క్రికెట్‌లోకి వచ్చాడని తెలిపింది.
ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు షమీ, అతని సోదరుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. హసీన్ ఆరోపణలతో విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతను ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చింది. ఇటీవల రోహిత్‌తో చిట్ చాట్ సందర్భంగా తన వ్యక్తిగత సమస్యలను పంచుకున్న షమీ.. ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
హిందూ దేవాలయం సందర్శించి మరీ.. సాయం చేసిన అఫ్రిది!