Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రికార్డుల కోసం ఆడితే జట్టులో కొనసాగలేం: విరాట్ కోహ్లీ

వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలుపే తనకు ముఖ్యమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి స్పష్టం చేశాడు. రికార్డుల కోసం ఆడితే ఇంతకాలం జట్టులో కొనసాగేవాడిని కాదన్నాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో సత్తా చాటాడు.

ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఈ రికార్డ్ తనకు ప్రత్యేకమైనదే అయినప్పటికీ.. జట్టు విజయంతో దానిని అందుకోవడం మరింత ఆనందంగా ఉందని చెప్పాడు. రికార్డుల కోసం ఆడితే ప్రధాన లక్ష్యాన్ని పక్కన పెట్టాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు.

IND vs WI: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్!

IND vs WI: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్!

జట్టు విజయమే నాకు ముఖ్యం..

'వ్యక్తిగత గణంకాల కంటే జట్టు విజయమే నాకు ముఖ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును గెలిపించేందుకు కృషి చేయాలి. నేను ఎప్పుడూ అదే పట్టుదలతో ఆడుతా. గణంకాల కోసం ఆడితే ఇంతకాలం కొనసాగలేం. రికార్డుల కోసం ప్రయత్నిస్తే ప్రధాన లక్ష్యాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉంది. అతనితో నాకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది.

Virat Kohli Says Personal Milestones Have Never Been His Primary Motivation Team Winning Matters Most

అతనికి ఆటపై మంచి క్లారిటీ ఉంది. అందుకే బ్యాటింగ్ సమయంలో ఇద్దరం ఎక్కువగా మాట్లాడుకోలేదు. అవసరమైనప్పుడు మాత్రమే నా అనుభవంతో కొన్ని సూచనలు ఇస్తా. ఒత్తిడి సమయంలో సీనియర్ ప్లేయర్స్.. జట్టులో సానుకూల వాతావరణం కల్పించాలి. సీనియర్లు నవ్వుతూ.. సరదాగా ఉంటే మిగతా ఆటగాళ్లలోనూ ఒత్తిడి తగ్గుతుంది. పెద్ద మ్యాచ్ అయినా ప్రశాంతంగా.. ఆత్మవిశ్వాసంతో ఆడొచ్చనే నమ్మకం వస్తుంది.'అని చెప్పుకొచ్చాడు.

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 295 పరుగులు చేసింది. జస్టీన్ గ్రీవ్స్ (101 బంతుల్లో 12 ఫోర్లతో 101) సెంచరీతో చెలరేగగా.. జాన్ కాంప్‌బెల్(60 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62), అమీర్ జాంగూ(43 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/40) నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ(2/60) రెండు వికెట్లు పడగొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీసాడు.

కోహ్లీ కెప్టెన్సీకి నేను వీరాభిమానిని.. ఆ వార్తలను చూసి నవ్వుకుంటాం: రోహిత్ శర్మ

Also Read

కోహ్లీ కెప్టెన్సీకి నేను వీరాభిమానిని.. ఆ వార్తలను చూసి నవ్వుకుంటాం: రోహిత్ శర్మ

అనంతరం భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్లకు 300 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్స్‌లతో 139 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 110) సెంచరీతో సత్తా చాటాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గౌహతి వేదికగా బుధవారం జరగనుంది.

Story first published: Tuesday, September 29, 2026, 18:20 [IST]
Other articles published on Sep 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+