Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కెప్టెన్సీకి నేను వీరాభిమానిని.. ఆ వార్తలను చూసి నవ్వుకుంటాం: రోహిత్ శర్మ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ ఏ మాత్రం మారలేదని, అతనితో బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తమ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చే వార్తలను చూసి ఇద్దరం నవ్వుకుంటామని తెలిపాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి తాను వీరాభిమానిని అని చెప్పాడు.

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను విరాట్ కోహ్లీ సెంచరీతో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగిన కోహ్లీ.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Asian Games 2026: ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీస్.. అసోసియేట్ జట్లకు తీరని అన్యాయం!

Asian Games 2026: ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీస్.. అసోసియేట్ జట్లకు తీరని అన్యాయం!

విరాట్ కెప్టెన్సీకి వీరాభిమానిని..

తాజాగా జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టును గెలిపించాలనే తపన అతనిలో ఏ మాత్రం తగ్గలేదన్నాడు. 'విరాట్ కోహ్లీ భారత జట్టు కోసం ఏం చేశాడనేది అందరికీ తెలుసు. దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రతీ రోజు మైదానంలోకి రావడం, బాగా ప్రాక్టీస్ చేయడం, పరుగులు సాధించి భారత్‌ను గెలిపించడం... కోహ్లీ దినచర్య. ఈ విషయంలో ఏది మారలేదు.

Rohit Sharma Says He Was a Fan of Virat Kohli s Test Captaincy Dismisses Differences
Photo Credit: twitter (X)

తను కెప్టెన్‌గా ఉన్నప్పుడైనా.. నేను సారథిగా ఉన్నా కోహ్లీ మారలేదు. ఇక ముందు కూడా మారడు. టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ భారత జట్టును నడిపించిన తీరు అద్భుతం. అతని టెస్ట్ కెప్టెన్సీకి నేను వీరాభిమానిని. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య ఆటను ఎలా మెరుగుపర్చుకోవాలో అనే చర్చ జరుగుతూనే ఉంటుంది.

జనాలకు మసాలా వార్తలు కావాలి..

మా ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉందంటూ టీవీల్లో వచ్చే వార్తలను చూసి మేం నవ్వుకుంటాం. జనాలు 'మసాలా' వార్తలు కోరుకుంటారు. అందుకే అలాంటి కథనాలు వస్తుంటాయి. నేను 2007లో, విరాట్ 2008లో అరంగేట్రం చేశాం. దాదాపు ఒకే సమయంలో కెరీర్ మొదలుపెట్టి సుదీర్ఘ కాలంగా భారత జట్టుకు ఆడుతున్నాం.

మా ఇద్దరి విధానం వేరు కావచ్చు. కానీ ప్రపంచకప్ గెలవాలి అనే లక్ష్యం మాత్రం ఒకటే. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మా మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఎవరి బౌలింగ్‌లో అటాక్ చేయాలి? ఎప్పుడూ సింగిల్ తీయాలి? అని ప్లాన్ చేసుకుంటాం.

నా కోసం ఆటనే మార్చుకుంటాడు..

నా కాలుకేమైనా సమస్య అనిపిస్తే.. 'భయ్యా.. కాస్త చూసి పరుగెత్తు. నా కాలు కాస్త ఇబ్బందిగా ఉంది'అని విరాట్‌తో చెబితే.. తను వెంటనే అర్థం చేసుకొని సహకరిస్తాడు. తన ఆటనే మార్చుకుంటాడు. కోహ్లీకి ప్రపంచకప్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

భారత జట్టులో అత్యధికంగా 4 వన్డే ప్రపంచకప్‌లు(2011, 2015, 2019, 2023) ఆడిన అనుభవం అతనికి మాత్రమే ఉంది. 2007 ప్రపంచకప్ అయినా.. మరో టోర్నీ అయినా విజయం కోసం కోహ్లీ ఎంతలా పరితపిస్తాడో అందరికి తెలుసు.

Asian Games 2026 ఫైనల్లో భారత్ X పాకిస్థాన్..?

Also Read

Asian Games 2026 ఫైనల్లో భారత్ X పాకిస్థాన్..?

కలుసుకోవడం ఇప్పుడు చాలా తక్కువ..

బ్యాటింగ్ సమస్యల గురించి ఇద్దరం మాట్లాడుకుంటాం. ఒకరికొకరం సలహాలు ఇచ్చుకుంటాం. కానీ ఇప్పుడు మేమిద్దరం వన్డేలు మాత్రమే ఆడుతుండటంతో ఎక్కువగా కలవలేకపోతున్నాం. పైగా అతను నాకు చాలా దూరంగా నివసిస్తున్నాడు. గతంలో కాకుండా ఇప్పుడు ఇంట్లో కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి మాకు టైమ్ దొరుకుతుంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, September 29, 2026, 11:36 [IST]
Other articles published on Sep 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+