Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్‌తో తీవ్ర వాగ్వాదం.. టీమిండియా హోటల్‌ నుంచి వెళ్లిపోయిన కోహ్లీ!(వీడియో)

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. లార్డ్స్ వేదికగా జరిగే సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఊహాగానాలు భారత అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు లార్డ్స్ వేదికగా జరిగే ఆఖరి వన్డేనే చివరి మ్యాచ్ అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కోహ్లీ వాగ్వాదానికి దిగాడని.. భారత జట్టు హోటల్‌ నుంచి వెళ్లిపోయాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ వాదనకు బలం చేకూర్చేలా ఓ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది.

Virat Kohli leaves Team India hotel after London arrival ahead of 3rd ODI amid clash with Gambhir

ఈ వీడియో ప్రకారం బస్సు దిగిన ఆటగాళ్లంతా హోటల్ గదిలోకి వెళ్లగా.. కోహ్లీ మాత్రం ఒంటరిగా దూరంగా వెళ్లాడు. అయితే ప్రత్యేక అనుమతితో లండన్‌లోని తన ఇంటికి వెళ్లి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా గంభీర్‌తో ఉన్న విభేదాలతో ముడిపెడుతూ కోహ్లీ టీమ్ హోటల్ గది నుంచి వెళ్లిపోయాడని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. తన కుటుంబాన్ని కలిసేందుకే విరాట్ కోహ్లీ హోటల్ గదిని వీడినట్లు తెలుస్తోంది.

రెండేళ్ల క్రితమే విరాట్ కోహ్లీ తన కుటుంబంతో లండన్‌ను షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. తన సతీమణి అనుష్క శర్మతో పాటు ఇద్దరు పిల్లలతో కోహ్లీ అక్కడే ఉంటున్నాడు. ఐపీఎల్, వన్డే సిరీస్‌లు, వ్యాపారాలు, ప్రమోషన్స్ పనుల కోసం మాత్రమే భారత్‌కు వస్తున్నాడు.

ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 5 పరుగులే చేసి విఫలమైన కోహ్లీ.. రెండో వన్డేలో 66 బంతుల్లో 8 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. మూడో వన్డేలో కూడా అదే జోరు కొనసాగించాలని అతని అభిమానులు ఆశిస్తున్నారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలను కూడా బీసీసీఐ ఖండించింది. లార్డ్స్ వన్డే తన ఆఖరి మ్యాచ్ కాదని స్పష్టం చేసింది.

Story first published: Saturday, July 18, 2026, 17:41 [IST]
Other articles published on Jul 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+