IND vs ENG: భారత తుది జట్టులో అతిపెద్ద సమస్య.. గంభీర్ చేసిన పొరపాటు ఇదే!
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్‌లో ఓడింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైనా.. లోయరార్డర్ బ్యాటర్స్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ 100 ప్లస్ రన్స్ భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. కానీ రెండో వన్డేలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. టాపార్డర్ బ్యాటర్లు రాణించగా.. లోయరార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు.
దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 233 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 26, శుభ్‌మన్ గిల్(31), విరాట్ కోహ్లీ(65), శ్రేయస్ అయ్యర్(66) రాణించగా.. మిగతా బ్యాటర్లు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. దాంతో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తుది జట్టు ఎంపిక చాలా పేలవంగా ఉందని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

రెండో వన్డే ఆడిన భారత జట్టులో మొత్తం ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను తీసేస్తే నలుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో ఇద్దరు హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. మరో ఇద్దరు మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మార్చడంలో విఫలమయ్యారు. దాంతో ఆల్‌రౌండర్లపై ఒత్తిడి పెరిగిందని, వారు దీన్ని తట్టుకోలేకపోతున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్లు అవసరం లేదని, అదనంగా స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆల్‌రౌండర్లపైనే ఎక్కువగా ఆధారపడితే మ్యాచ్ ఫలితాలు ఇలానే ఉంటాయాని విమర్శిస్తున్నారు.
ప్రతి మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండర్లు జట్టును కాపాడుతారని అనుకోవడం అవివేకమని అభిప్రాయపడ్డారు. ఈ తరహా మిడిలార్డర్‌తో ప్రపంచకప్ సిద్దమవడం కూడా తప్పని వారు సూచించారు. ఆల్‌రౌండర్లపై ఉన్న అంతులేని అభిమానమే అసలు సమస్య అని, అదనంగా ఒక ఆల్‌రౌండర్ ఉంటే సరిపోతుందని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications