Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అతను విరాట్ కోహ్లీ కంటే బాగా ఆడాడు: అశ్విన్

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో విరాట్ కోహ్లీ కంటే శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడని కొనియాడాడు. ఏ ఆటగాడైనా కోహ్లీ కంటే బాగా ఆడాడని చెప్పడం కష్టమని, కానీ అయ్యర్ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడని కితాబిచ్చాడు.

ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించాడు. విరాట్ కోహ్లీ(66 బంతుల్లో 8 ఫోర్లతో 65)తో కలిసి నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

IND vs ENG మూడో వన్డే: రోహిత్ శర్మకు ఆఖరి మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే!

IND vs ENG మూడో వన్డే: రోహిత్ శర్మకు ఆఖరి మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే!

శ్రేయస్ బ్యాటింగ్ అద్భుతం..

శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ప్రదర్శన గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చాలా అద్బుతంగా ఉంది. విరాట్ కోహ్లీతో కలిసి ఆడుతున్నప్పుడు అతని కంటే మరెవరైనా బాగా ఆడారని చెప్పడం చాలా కష్టం. కానీ ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌ విరాట్ కోహ్లీకి దీటుగా ఉంది. ఇది భారత క్రికెట్‌కు చాలా మంచి సంకేతం.

Ravichandran Ashwin Huge Praise Shreyas Iyer Says He batted better than Virat Kohli

వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. ఎందుకంటే అతను లక్ష్యాన్ని చాలా బాగా అంచనా వేయగలడు. అతను ఔటవ్వగానే.. అనుభవం లేని భారత బ్యాటింగ్‌లైనప్‌కు పరుగులు చేయడం కష్టమైంది. వాషింగ్టన్ సుందర్‌ గాయం గురించి నాకు తెలియదు కానీ. అతనితో పాటు శిమ్ దూబే, అక్షర్ పటేల్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

IND vs ENG: సామ్ కరణ్ X శ్రేయస్ అయ్యర్ మధ్య గొడవ!(వీడియో)

IND vs ENG: సామ్ కరణ్ X శ్రేయస్ అయ్యర్ మధ్య గొడవ!(వీడియో)

కోహ్లీ వికెట్ కీలకం..

ఈ పిచ్‌‌పై విరాట్ కోహ్లీ చాలా కీలకం. ఈ తరహా వికెట్లపై అందరూ సులువుగా ఆడలేరు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ 250-260 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఇంగ్లండ్ విజయానికి మరింత కష్టపడాల్సి వచ్చేది.

నేను శుభ్‌మన్ గిల్‌ను ప్రశంసించాలనుకుంటున్నాను. కోహ్లీ అద్భుతంగా ఆడాడు. కానీ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ భిన్నంగా ఉంది. అతను ఒక్క బంతిని కూడా వదిలేయలేదు. అతను మంచి టచ్‌లో కనిపించాడు. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశం. అతను ఔటైన తీరు దురదృష్టకరం. సాధారణంగా ఆ షాట్ ఆడినప్పుడు బంతి కవర్స్ వైపు బౌండరీ వెళ్లిపోయేది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తొలి వన్డేలో 75 బంతుల్లో 80 పరుగులు చేసిన గిల్.. క్రాంప్స్‌తో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. లేదంటే సెంచరీ చేసుకునేవాడు. ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగే ఫైనల్ వన్డే‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రోహిత్ శర్మకు ఇదే చివరి మ్యాచ్‌ అని ప్రచారం జరుగుతుండటంతో ఈ వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Story first published: Saturday, July 18, 2026, 13:48 [IST]
Other articles published on Jul 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+