Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ రోజుకు దగ్గరయ్యాం.. లింక్డిన్‌లో విరాట్ కోహ్లీ తొలి పోస్ట్!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ 'లింక్డిన్‌'లోకి అడుగు పెట్టాడు. తన విజన్ గురించి సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. భారత్‌లో ప్రతి క్రీడనూ ఆదరించి, ఆస్వాదించే రోజులు రావాలని తానెప్పుడూ కోరుకుంటానని, ఇప్పుడు ఆ రోజుకు మరింత దగ్గరవుతున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీ లింక్డిన్‌లోకి అడుగుపెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రముఖ స్పోర్ట్స్ వేర్ వన్8వరల్డ్‌కు సహవ్యవస్థాపకుడిగా... స్పోర్ట్స్ బ్రాండ్ అజిలిటాస్‌లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తిగా.. భారత క్రికెట్ టీమ్ ప్రొఫెషనల్ అథ్లెట్‌గా కోహ్లీ తన లింక్డ్‌ఇన్ బయోలో రాసుకొచ్చాడు. తరతరాలు గుర్తుంచుకునే స్పోర్ట్స్ బ్రాండ్‌ను సృష్టించడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని చెప్పుకొచ్చాడు.

Virat Kohli Joins LinkedIn as one8 Co-Founder and Agilitas Investor to Build Indian Sports Brands

ప్రతీ ఆటను ఆస్వాదించే రోజు రావాలి..

'భారత్‌లో క్రికెట్ మాత్రమే కాకుండా ప్రతీ క్రీడను ఆదరించి, ఆస్వాదించే రోజులు రావాలని నేనెప్పుడూ కోరుకుంటాను. ఇప్పుడు ఆ రోజుకు మరింత దగ్గరవుతున్నట్లు అనిపిస్తోంది. మన దేశం వరల్డ్ క్లాస్ ప్లేయర్లను తయారు చేయగలదని, అంతర్జాతీయ వేదిక కోసం బ్రాండ్‌లను సృష్టించగలదని కొత్త తరం నిరూపిస్తోంది. భారత్ ఓ సమగ్ర క్రీడా వేదికను నిర్మించగలదనే నమ్మకం కలుగుతోంది.

కోహ్లీని తప్పించి నన్ను ఆర్‌సీబీ కెప్టెన్ చేయాలనుకున్నారు: పార్దీవ్ పటేల్

కోహ్లీని తప్పించి నన్ను ఆర్‌సీబీ కెప్టెన్ చేయాలనుకున్నారు: పార్దీవ్ పటేల్

క్రీడల ప్రపంచంలో భారత్ కేవలం పోటీపడడమే కాదు.. అంతర్జాతీయ క్రీడల భవిష్యత్తును సైతం శాసించగలదనే నమ్మకం నాకుంది. అందుకే నేను 'అగిలిటాస్' కంపెనీలో ఇన్వెస్టర్‌గా చేరాను. 'one8world' అనే బ్రాండ్‌కు సహ-స్థాపకుడిగా.. కో-క్రియేటర్‌గా భాగస్వామ్యమయ్యాను.

నేను నమ్మిన సూత్రం ఒక్కటే..

నా కెరీర్ అంతటా నేను నమ్మిన ఒకే ఒక్క సూత్రం పైనే 'one8' నిర్మితమైంది. హద్దులు దాటుకుని ముందడుగు వేసినప్పుడు, నాణ్యతా ప్రమాణాలను పెంచుకున్నప్పుడు భిన్నంగా ఆలోచించే ధైర్యం చేసినప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుంది.

ఆ ఆలోచనతోనే ఈ one8 బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేశాం. నా సొంత నగరంలో వేలాది మంది అభిమానుల సమక్షంలో 'one8world' ప్రాణం పోసుకోవడం చూస్తుంటే నా జీవితంలోనే అత్యంత మరచిపోలేని క్షణాల్లో ఒకటిగా అనిపించింది.

2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా కోహ్లీ ఆడుతాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

Also Read

2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా కోహ్లీ ఆడుతాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

మా లక్ష్యం ఒక్కటే.. మా తర్వాత కూడా తరతరాల పాటు నిలిచిపోయే ఒక గొప్ప బ్రాండ్‌ను నిర్మించాలి. ప్రస్తుతం మేం సాగిస్తున్న ప్రయాణం అదే!'అని విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Story first published: Tuesday, October 13, 2026, 15:22 [IST]
Other articles published on Oct 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+