2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా కోహ్లీ ఆడుతాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భవితవ్యంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా విరాట్ కోహ్లీ కొనసాగుతాడని జోస్యం చెప్పాడు. అతనిలో ఇంకా పరుగులు చేయాలనే ఆకలి చావలేదని స్పష్టం చేశాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 2027 వన్డే ప్రపంచకప్ తనకు చివరిదని విరాట్ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ పనేసర్ మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీలో ఆటపై ఆకలి, దూకుడు, ఫిట్‌నెస్‌పై శ్రద్ద ఏ మాత్రం తగ్గలేదని, తనను బాగా ఆకట్టుకుంటాయని చెప్పాడు. కోహ్లీ ట్రైనింగ్ చేసే విధానం చూస్తే తాను కూడా జిమ్‌కు వెళ్లాలనిపిస్తుందని పేర్కొన్నాడు.

కోహ్లీ ఆకలి చావలేదు..
'విరాట్ కోహ్లీలో ఇప్పటికీ పరుగులు చేయాలనే ఆకలి చాలా ఉంది. ప్రతి మ్యాచ్‌ను ఎంతో తీవ్రతతో ఆడతాడు. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. తన చుట్టూ ఉన్న ఆటగాళ్లను కూడా ప్రోత్సహిస్తాడు. అతను ఆడేది ఇంకా 10-15 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయని భావిస్తే ప్రతి మ్యాచ్‌ను ప్రత్యేకంగా చూస్తాం.
కోహ్లీ కూడా ప్రస్తుతం అదే మైండ్‌సెట్‌తో ఆడుతున్నట్లు అనిపిస్తోంది. మైదానంలో తన వంద శాతం పెడుతున్నాడు. అందుకే వన్డే ప్రపంచకప్ తర్వాత అతను రిటైర్ అవుతాడని నాకు అనిపించడం లేదు. అతని నుంచి మనం ఇంకా చాలా క్రికెట్ చూడొచ్చు.'అని మాంటి పనేసర్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శతకంతో సత్తా చాటాడు. రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ.. అతనికి వన్డే ప్రపంచకప్ జట్టులో అవకాశం ఇవ్వాలని సూచించాడు.
రోహిత్ గొప్ప ఆటగాడని, క్రీజులో కుదురుకుంటే విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయగలడని తెలిపాడు. 'రోహిత్ గొప్ప ఆటగాడు. అతను ఫామ్‌లోకి వస్తే బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేయగలడు. భారత్‌కు అతని లాంటి నాణ్యమైన ఆటగాడి అవసరం ఉంది.' అని పనేసర్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

