కోహ్లీని తప్పించి నన్ను ఆర్‌సీబీ కెప్టెన్ చేయాలనుకున్నారు: పార్దీవ్ పటేల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ ఐకాన్ అయిన విరాట్ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని ఆ జట్టు ప్రయత్నించిందని మాజీ క్రికెటర్ పార్దీవ్ పటేల్ అన్నాడు. ఆ జట్టు తరఫున కొన్ని సీజన్లు ఆడిన పార్టీవ్ పటేల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఐపీఎల్ 2019 సీజన్‌లో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. దాంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీని తప్పించాలని అప్పటి బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా, హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్దీవ్ పటేల్‌కు చెప్పి.. తదుపరి సీజన్‌లో సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉండని తెలిపారు. కానీ తదుపరి సీజన్‌కు ఈ ఇద్దరే లేకుండా పోయారు. వారి స్థానాల్లో మైక్ హెస్సన్, సిమన్ కటిచ్ బాధ్యతలు తీసుకున్నారు.
పార్టీవ్ పటేల్‌కు కూడా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు ఏబీ డివిలియర్స్ వికెట్ కీపింగ్ చేయగా.. పార్దీవ్ పటేల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేశాడు. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఆర్‌సీబీ ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరింది. నాలుగేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

తాజాగా ఈ కెప్టెన్సీ మార్పు గురించి మొయిన్ అలీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించగా.. పార్దీవ్ పటేల్ స్పందించాడు. 'నేను ఈ విషయం గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు, కానీ మొయిన్ అలీ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అప్పట్లో నాతో... 'రాబోయే సీజన్‌కి సిద్ధంగా ఉండు, నిన్ను టీమ్‌లో కీలక పాత్ర కోసం ఆలోచిస్తున్నాం'అని ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్‌స్టెన్ చెప్పారు.
కానీ ఆ మరుసటి ఏడాదికి జట్టులో వారే లేకుండా పోయారు. వారి స్థానల్లో కొత్త కోచ్‌లు వచ్చారు.దాంతో ఆ సీజన్ మొత్తంలో నాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.'అని పార్దీవ్ పటేల్ పేర్కొన్నాడు. పూర్తిగా బెంచ్‌కే పరిమితం కావడంతో తీవ్ర నిరాశకు గురైన పార్దీవ్ పటేల్.. తదుపరి సీజన్‌కు ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు.
పార్దీవ్ పటేల్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఆర్‌సీబీ(2014, 2018-2010), చెన్నై సూపర్ కింగ్స్ (2008-2010), కొచ్చి టస్కర్స్ (2011), డెక్కన్ ఛార్జర్స్ (2012), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2013), ముంబై ఇండియన్స్ (2015-2017) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2015, 2017లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


