Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: ఏడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్! (వీడియో)

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చాడు. ఏడేళ్ల తర్వాత వన్డేల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో న్యూ చండీఘడ్ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్‌ దిగగా.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ 3 బంతుల వ్యవధిలోనే వెనుదిరిగారు.

జైడెన్ సీల్స్ వేసిన మూడో ఓవర్‌ మూడో బంతికి శుభ్‌మన్ గిల్(1) క్యాచ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిడిల్ స్టంప్‌లైన్‌లో వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని కోహ్లీ ఫ్లిక్ చేయబోయాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమై మిస్ అయ్యాడు. దాంతో బంతి నేరుగా మిడిల్ స్టంప్‌ను లేపేసింది.

IND vs WI: ఈజీ క్యాచ్ వదిలేసిన విరాట్ కోహ్లీ!(వీడియో)

IND vs WI: ఈజీ క్యాచ్ వదిలేసిన విరాట్ కోహ్లీ!(వీడియో)

స్టేడియం మొత్తం ఒక్కసారిగా పిన్-డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు వరుసగా 2 బంతుల్లో ఔటవ్వడంతో అంతా నిర్ఘాంత పోయారు. క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి రోహిత్ శర్మ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.

Virat Kohli Falls for Golden Duck After 7 Years as Jayden Seales Shocks Him in 3rd ODI

ఏడేళ్ల తర్వాత గోల్డెన్ డక్..

వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ డకౌటవ్వడం ఇది నాలుగోసారి మాత్రమే. చివరిసారిగా ఏడేళ్ల క్రితం 2019, డిసెంబర్ 18న వైజాగ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కీరన్ పోలార్ట్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌటయ్యాడు. వన్డేల్లో కోహ్లీని తొలిసారి గోల్డెన్ డక్ చేసిన బౌలర్ వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ప్రస్తుత హెడ్ కోచ్ డారెన్ సామీ కావడం గమనార్హం. 2011, జూన్ 11న నార్త్ సౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో సామీ ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత 2013, జనవరి 27న ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ బ్రెస్నన్ కూడా కోహ్లీని తొలి బంతికే ఔట్ చేశాడు.

ఓవరాల్‌గా వన్డేల్లో కోహ్లీ డకౌట్ కావడం 19వ సారి. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ, సచిన్ టెండూల్కర్ టాప్-2లో ఉన్నారు. సచిన్ 463 వన్డేల్లో 20 సార్లు డకౌట్ కాగా.. కోహ్లీ 317 మ్యాచ్‌ల్లో 19 సార్లు డకౌటయ్యాడు. మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ కూడా తన వన్డే కెరీర్‌లో 19 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.

మూడు మార్పులతో భారత్..

ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భారీ శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. శుభ్‌మన్ గిల్ అయితే ఒక సెంచరీ, డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌కు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్ రీఎంట్రీ ఇవ్వగా.. అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేశాడు. ప్రసిధ్ కృష్ణ గాయంతో జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో అన్షుల్ కంబోజ్‌కు అవకాశం దక్కింది. అకిబ్ నబీ స్థానంలో సిరాజ్ బరిలోకి దిగాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఎంచుకున్నట్లు టాస్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

IND vs WI: కొంపముంచిన కోహ్లీ.. వెస్టిండీస్ బ్యాటర్ల ఊచకోత! ఆల్‌టైమ్ రికార్డ్!

Also Read

IND vs WI: కొంపముంచిన కోహ్లీ.. వెస్టిండీస్ బ్యాటర్ల ఊచకోత! ఆల్‌టైమ్ రికార్డ్!

తుది జట్లు:

వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, జువెల్ ఆండ్రూ, షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), అమీర్ జాంగూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, కీమో పాల్, మాథ్యూ ఫోర్డే, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జెడెన్ సీల్స్, విటెల్ లావ్స్

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అన్షుల్ కంబోజ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.

Story first published: Saturday, October 3, 2026, 15:35 [IST]
Other articles published on Oct 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+