Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: ఈజీ క్యాచ్ వదిలేసిన విరాట్ కోహ్లీ!(వీడియో)

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌లో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కళ్లు చెదిరే క్యాచ్‌లకు కోహ్లీ పెట్టింది పేరు. కోహ్లీ ఉన్నాడంటే అటువైపు బ్యాటర్లు షాట్ ఆడేందుకు కూడా భయపడుతారు. బంతిని ఆపడంలో.. రనౌట్ చేయడంలోనూ కోహ్లీకి సాటిలేరు. కానీ అలాంటి విరాట్ కోహ్లీ ఆశ్చర్యకరంగా లడ్డూ లాంటి క్యాచ్‌ను వదిలేసాడు.

IND vs WI: నమన్ ధీర్ స్టన్నింగ్ క్యాచ్.. ఔటా? నాటౌటా?(వీడియో)

IND vs WI: నమన్ ధీర్ స్టన్నింగ్ క్యాచ్.. ఔటా? నాటౌటా?(వీడియో)

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కోహ్లీ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ పనైపోయిందంటూ యాంటీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

IND vs WI Virat Kohli Drops Easy Catch of Shai Hope During 2nd ODI Video Goes Viral

అసలేం జరిగిందంటే..?

నమన్ ధీర్ వేసిన 20వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ రెండో బంతిని నమన్ ధీర్ ఫుల్లిష్ డెలివరీ‌గా వేయగా.. షై హోప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఉన్న కోహ్లీ చేతుల్లోకి బంతి దూసుకురాగా.. అతను అందుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ అలర్ట్‌గా లేకపోవడంతో బంతిని అతని చేతులను తాకుతూ దూరంగా వెళ్లిపోయింది.

IND vs WI: సిరాజ్ రీఎంట్రీ.. ఆ ముగ్గురికి నిరాశే! వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs WI: సిరాజ్ రీఎంట్రీ.. ఆ ముగ్గురికి నిరాశే! వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

ఈ క్యాచ్ పట్టి ఉంటే నమన్ ధీర్‌కు తొలి అంతర్జాతీయ వికెట్ దక్కడంతో పాటు షైహోప్ 27 పరుగుల వద్దే వెనుదిరిగేవాడు. కానీ ఈ అవకాశంతో షైహోప్ చెలరేగాడు. ఈ క్రమంలో 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షై హోప్ సెంచరీకి చేరువయ్యాడు. దాంతో వెస్టిండీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. 34 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 262 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Story first published: Wednesday, September 30, 2026, 16:55 [IST]
Other articles published on Sep 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+