Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: కొంపముంచిన కోహ్లీ.. వెస్టిండీస్ బ్యాటర్ల ఊచకోత! ఆల్‌టైమ్ రికార్డ్!

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత బౌలర్లు తేలిపోయారు. గౌహతి వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు జాన్ క్యాంబెల్(68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101), కెప్టెన్ షై హోప్(94 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104), అమీర్ జంగూ(77 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114) శతకాలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, జడేజా రెండేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు.

Asian Games 2026: వైభవ్‌కు నో ఛాన్స్.. శ్రీలంకతో సెమీఫైనల్ ఆడే భారత జట్టు ఇదే!

Asian Games 2026: వైభవ్‌కు నో ఛాన్స్.. శ్రీలంకతో సెమీఫైనల్ ఆడే భారత జట్టు ఇదే!

15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షై హోప్ ఇచ్చిన కష్టమైన రిటర్న్ క్యాచ్‌ను కుల్దీప్ యాదవ్ వదిలేయగా.. 27 పరుగుల స్కోర్ వద్ద ఇచ్చిన మరో ఈజీ క్యాచ్‌ను విరాట్ కోహ్లీ నేలపాలు చేశాడు. ఈ రెండు క్యాచ్‌లు పట్టి ఉంటే వెస్టిండీస్ పరిస్థితి మరోలా ఉండేది. కోహ్లీ తప్పిదంతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఈ అవకాశాలతో షై హోప్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. వెస్టిండీస్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్లు మూడు శతకాలు చేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా వన్డే క్రికెట్‌ చరిత్రలోనే వెస్టిండీస్‌కు ఇది రికార్డ్ స్కోర్.

IND vs WI Virat Kohli Costly Drop as West Indies Post 405 7 After Centuries From Campbell Hope and Jangoo

తేలిపోయిన పేసర్లు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్ కీసీ కార్టీ(9) విఫలమైనా.. మరో ఓపెనర్ జాన్ క్యాంబెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. భారత పేసర్లపై భారీ షాట్లతో విరుచుకుపడిన జాన్ క్యాంబెల్.. వేగంగా పరుగులు రాబట్టాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన క్యాంబెల్.. ఆకీబ్ నబీ, ప్రసిధ్ కృష్ణలను ఊచకోత కోసాడు. దాంతో పవర్ ప్లేలో వెస్టిండీస్ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది.

అనంతరం మరింత దూకుడగా ఆడిన క్యాంబెల్ 68 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన క్యాంబెల్‌(68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101)ను గుర్నూర్ బ్రార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

IND vs WI: ఈజీ క్యాచ్ వదిలేసిన విరాట్ కోహ్లీ!(వీడియో)

Also Read

IND vs WI: ఈజీ క్యాచ్ వదిలేసిన విరాట్ కోహ్లీ!(వీడియో)

కొంపముంచిన కోహ్లీ..

క్రీజులోకి వచ్చిన అమీర్ జంగూతో కలిసి షై హోప్ చెలరేగాడు. 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షై హోప్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను విరాట్ కోహ్లీ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన షై హోప్.. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అమీర్ జంగూ కూడా దూకుడగా ఆడి 44 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

హాఫ్ సెంచరీల అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలో షై హోప్ 90 బంతుల్లో.. జంగూ 70 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 182 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. క్రీజులోకి వచ్చిన షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(0) నిరాశపర్చాడు. గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

రోస్టన్ ఛేజ్‌తో కలిసి జంగూ చెలరేగినా.. అతనికి జడేజా అడ్డు కట్ట వేసాడు. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. కీమో పాల్‌(3)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. రోస్టన్ ఛేజ్(29 నాటౌట్) విండీస్ స్కోర్‌ను 400 పరుగుల మార్క్‌ను ధాటించాడు.

Story first published: Wednesday, September 30, 2026, 18:07 [IST]
Other articles published on Sep 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+