IND vs WI: సిరాజ్ రీఎంట్రీ.. ఆ ముగ్గురికి నిరాశే! వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. గువహతి వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో పర్యాటక విండీస్‌తో ఆతిథ్య భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌ల విధ్వంసకర శతకాలతో తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
రెండో వన్డేలోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది. తద్వారా ఆఖరి వన్డేలో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో చేసిన తప్పిదాలను సరిచేసుకొని రెండో మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో వెస్టిండీస్ ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సిరాజ్ రీఎంట్రీ..
తొలి వన్డేకు దూరంగా ఉన్న మహమ్మద్ సిరాజ్.. ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. సిరాజ్ కోసం ప్రసిధ్ కృష్ణకు విశ్రాంతి ఇవ్వవచ్చు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఆడనుండగా.. విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో ఆడనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.

తొలి వన్డేలో ఈ నలుగురికే బ్యాటింగ్ చేసే అవకాశం రాగా.. కోహ్లీ, గిల్ శతకాలతో చెలరేగారు. 32 పరుగులతో రోహిత్ పర్వాలేదనిపించినా.. అతను భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి తర్వాతి స్థానాల్లో బౌలింగ్ చేయనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటాడు.
వెస్టిండీస్‌తో రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, అకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


