Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: నమన్ ధీర్ స్టన్నింగ్ క్యాచ్.. ఔటా? నాటౌటా?(వీడియో)

టీమిండియా యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో నమన్ ధీర్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్ మాన్‌లా డైవ్ చేస్తూ అదిరిపోయే క్యాచ్ పట్టాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌కు కీసీ కార్టీ(9) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

అంతా వారి వల్లే.. ఓటమికి కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్

అంతా వారి వల్లే.. ఓటమికి కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్

ప్రసిధ్ కృష్ణ వేసిన 5వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని ప్రసిధ్ కృష్ణ గుడ్ లెంగ్త్‌లో వేయగా.. కీసీ కార్టీ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా.. కవర్ పాయింట్‌లో ఉన్న నమన్ ధీర్ అద్భుతంగా డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో బంతి నేలకు తాకినట్లు కనిపించడంతో ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు.

IND vs WI Naman Dhir Takes Stunning Catch But Is It Out or Not Out Viral Video Sparks Debate

పలు కోణాల్లో రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి కింద చేతులు ఉన్నాయని చెప్పి ఔటిచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మెన్ కింద నాటౌట్ ఇవ్వాల్సిందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది ఔటా?నాటౌటా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

IND vs WI: సిరాజ్ రీఎంట్రీ.. ఆ ముగ్గురికి నిరాశే! వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs WI: సిరాజ్ రీఎంట్రీ.. ఆ ముగ్గురికి నిరాశే! వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. కీసీ కార్టీ(9) త్వరగానే ఔటైనా.. క్యాంబెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. భారత పేసర్లను చెడుగుడు ఆడాడు. దాంతో వెస్టిండీస్‌ పవర్ ప్లేలో వికెట్‌ నష్టానికి 96 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం కూడా అదే జోరు కనబర్చిన క్యాంబెల్.. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రమాదకరంగా మారిన క్యాంబెల్‌(68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101)ను గుర్నూర్ బ్రార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వచ్చిన అమీర్ జాంగూతో కలిసి షైహోప్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతను 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అమీర్ జాంగూ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు.

Story first published: Wednesday, September 30, 2026, 15:24 [IST]
Other articles published on Sep 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+