IND vs ENG: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డ్ అందుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ(66 బంతుల్లో 8 ఫోర్లతో 65) హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ రికార్డ్‌ను విరాట్ కోహ్లీ అధిగమించాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి 59 మ్యాచ్‌లు, 79 ఇన్నింగ్స్‌ల్లో 2646* పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్(2645), సచిన్ టెండూల్కర్(2626), రోహిత్ శర్మ(2317*), మహేళ జయవర్దనే (2211) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇంగ్లండ్ గడ్డపై విరాట్ కోహ్లీ ఒకే ఒక వన్డే సెంచరీ చేశాడు. అది కూడా 2011లో కాగా.. రాహుల్ ద్రవిడ్ చివరి వన్డే కావడం గమనార్హం.

ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీ మొత్తం మూడు శతకాలు నమోదు చేయగా.. ఇందులో రెండు టెస్ట్‌ల్లో వచ్చాయి. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక శతకాలు నమోదు చేసిన భారత బ్యాటర్ రికార్డ్ రోహిత్(8), రాహుల్ ద్రవిడ్(8) పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ 7 శతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లండ్ గడ్డపై 17 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 33.21 సగటుతో 1096 పరుగులు చేశాడు. 35 వన్డేల్లో 51.03 సగటుతో 1378 పరుగులు సాధించాడు. 7 టీ20ల్లో 192 పరుగులు చేశాడు. పర్యాటక టీమ్స్‌ల్లో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వివ్ రిచర్డ్స్(3402), స్టీవ్ స్మిత్(3348), రికీ పాంటి(2833), అలన్ బోర్డర్(2799) విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(66 బంతుల్లో 8 ఫోర్లతో 65), శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. శుభ్‌మన్ గిల్ (30 బంతుల్లో 6 ఫోర్లతో 31), జస్‌ప్రీత్ బుమ్రా(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్(3/50), జోఫ్రా ఆర్చర్(3/47)లతో పాటు.. సకీబ్ మహ్మూద్(2/52) రెండు వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

