IND vs ENG: ఇలా ఆడితే కష్టం బాసూ.. యశస్వి జైస్వాల్ తన్నుకుపోతాడు!
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపర్చాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ (47 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26) విఫలమయ్యాడు. విల్ జాక్స్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచే రోహిత్ శర్మ ఇబ్బంది పడ్డాడు. జట్టులో చోటు కోల్పోతాననే భయంతో.. ఒత్తిడిలో బ్యాటింగ్ చేసినట్లు కనిపించాడు. బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్‌ను కూడా సమర్దవంతంగా ఆడలేకపోయాడు.
క్యాచ్ డ్రాప్ అయినా..
ఈ క్రమంలోనే రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను ఇంగ్లండ్ ప్లేయర్ గస్ అట్కిన్సన్ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్‌ను వదిలేయడంతో పాటు బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపలేకపోయాడు. అయితే ఈ అవకాశాన్ని రోహిత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తూ.. బౌండరీలు కొట్టలేక చివరకు కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా గత మంగళవారం జరిగిన తొలి వన్డేలోనూ రోహిత్ శర్మ(11) తీవ్రంగా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ విఫలమవ్వడంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
జైస్వాల్ తన్నుకుపోతాడు..
రోహిత్ శర్మను తప్పించి యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం 'ఇలా ఆడితే కష్టం బాసూ.. గేర్ మార్చాల్సిందే.. లేదంటే యశస్వి జైస్వాల్ తన్నుకుపోతాడు.'అని హెచ్చరిస్తున్నారు. టీ20 క్రికెట్‌తో పాటు టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వన్డే ప్రపంచకప్ గెలిచి ఆటకు సగర్వంగా వీడ్కోలు పలకాలనుకుంటున్నాడు. కానీ ఈ మెగా టోర్నీలో రోహిత్ ఆడాలంటే నిలకడగా రాణించడం ముఖ్యంగా. ఇలా వరుసగా మ్యాచ్‌ల్లో విఫలమైతే.. అతనిపై తీవ్ర విమర్శలు రెట్టింపు అవనున్నాయి. అప్పుడు రోహిత్ మరింత ఒత్తిడికి లోనవుతాడు. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగే ఆఖరి వన్డే రోహిత్ శర్మకు కీలకంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

