Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: కొంపముంచిన కోహ్లీ నిర్లక్ష్యం.. దెబ్బతీసిన మిడిలార్డర్ వైఫల్యం!

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 234 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నమోదు చేసింది. గస్ అట్కిన్సన్(3/50), జోఫ్రా ఆర్చర్(3/47) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది.

విరాట్ కోహ్లీ(66 బంతుల్లో 8 ఫోర్లతో 65), శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. శుభ్‌మన్ గిల్ (30 బంతుల్లో 6 ఫోర్లతో 31), జస్‌ప్రీత్ బుమ్రా(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్(3/50), జోఫ్రా ఆర్చర్(3/47)లతో పాటు.. సకీబ్ మహ్మూద్(2/52) రెండు వికెట్లు తీసాడు.

IND vs ENG: ఇలా ఆడితే కష్టం బాసూ.. యశస్వి జైస్వాల్ తన్నుకుపోతాడు!

IND vs ENG: ఇలా ఆడితే కష్టం బాసూ.. యశస్వి జైస్వాల్ తన్నుకుపోతాడు!

విల్ జాక్స్‌, సామ్ కరణ్ తలో వికెట్ పడగొట్టారు. నిలకడగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకోవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. గత మ్యాచ్ విన్నర్లు వాషింగ్టన్ సుందర్(2), అక్షర్ పటేల్(1)తో పాటు శివమ్ దూబే(0) వైఫల్యం భారత బ్యాటింగ్ పతనాన్ని శాసించింది. శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటంతో భారత్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది.

Jofra Archer and Gus Atkinson s Three-Wicket Hauls Helps England Bowl India Out for 234 in 2nd ODI

నిరాశపర్చిన రోహిత్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(31) సాధికారికంగా ఆడినా.. రోహిత్ శర్మ(26) తీవ్రంగా తడబడ్డాడు. దాంతో ఒత్తిడికి గురైన శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడే క్రమంలో గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. రోహిత్ తన తడబాటు కొనసాగించాడు.

రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరోవైపు కోహ్లీ మాత్రం స్వేచ్ఛగా చెలరేగాడు. చివరకు రోహిత్ దూకుడుగా ఆడే క్రమంలో విల్ జాక్స్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

IND vs ENG రెండో వన్డే: కేఎల్ రాహుల్‌పై వేటు.. ఎందుకంటే..?

IND vs ENG రెండో వన్డే: కేఎల్ రాహుల్‌పై వేటు.. ఎందుకంటే..?

కోహ్లీ నిర్లక్ష్యం..

కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్(1) తీవ్రంగా నిరాశపర్చాడు. సామ్ కరణ్ బౌలింగ్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇషాన్ వెనుదిరిగినా.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో అతను 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ నుంచి కూడా అతనికి మంచి సహకారం లభించింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

మరుసటి బంతినే నిర్లక్ష్యంగా భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్‌లోనే వాషింగ్టన్(2) ఔటవ్వగా.. అక్షర్ పటేల్(1), శివమ్ దూబే(0)లను వరుస బంతుల్లో జోఫ్రా ఆర్చర్ పెవిలియన్ చేర్చాడు. గుర్నూర్ బ్రార్‌తో జట్టు స్కోర్‌ను 200 ధాటించిన అయ్యర్.. 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గుర్నూర్ బ్రార్(7) విఫలమైనా.. బుమ్రాతో కలిసి 9వ వికెట్‌కు 23 పరుగులు జోడించాడు. నిలకడగా ఆడుతున్న అయ్యర్(66)ను గస్ అట్కిన్సన్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి ప్రసిధ్ కృష్ణ(0) క్లీన్ బౌల్డ్ చేసిన అట్కిన్సన్.. భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

Story first published: Thursday, July 16, 2026, 21:26 [IST]
Other articles published on Jul 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+