ప్రాక్టీస్ సెషన్‌లో శుభ్‌మన్ గిల్ X విరాట్ కోహ్లీ డిష్యూం డిష్యూం! (వీడియో)
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మాజీ సారథి విరాట్ కోహ్లీ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రాక్టీస్ సెషన్‌లో ఈ ఇద్దరూ గొడవపడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ సన్నదమవుతోంది. ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.
గురువారం నుంచే సన్నాహకాలు ప్రారంభించిన భారత్ ముమ్మురంగా సాధన చేస్తోంది. అయితే శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఫీల్డింగ్ డ్రిల్స్ సందర్భంగా కోహ్లీ, గిల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయగా.. ఏదో విషయంలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ వాగ్వాదానికి దిగారు. ఏ విషయం అనేదానిపై క్లారిటీ లేదు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరూ నవ్వుతూ కనిపించారు.
శుభ్‌మన్ గిల్‌కు గాయం..
ప్రాక్టీస్ సెషన్‌లో శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తుండగా.. పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన బంతి శుభ్‌మన్ గిల్ కుడి మోచేతికి బలంగా తాకింది. దాంతో తీవ్ర నొప్పితో విలవిలాడిన గిల్.. ప్రాక్టీస్ ఆపేసాడు. ఫిజియోలు ప్రథమ చికిత్స అందించి మోచేతికి బ్యాండేజ్ వేసారు.

శుభ్‌మన్ గిల్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. సిరాజ్ వేసిన బంతి అనూహ్యంగా స్వింగ్ కావడంతో గిల్ అంచనా వేయలేకపోయాడు. దాంతో బంతి మోచేతికి బలంగా తాకింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే.. తొలి వన్డేకు గిల్ దూరమవుతాడు. చిన్నదయితే మాత్రం బరిలోకి దిగుతాడు. శనివారం సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో శుభ్‌మన్ గిల్ గాయంపై స్పష్టత రానుంది.
బ్యాటింగ్ అనుకూలమైన పిచ్..
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ మైదానం పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. తొలి 10 ఓవర్లు బౌలింగ్‌కు అడ్వాంటేజ్‌గా ఉంటుంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. మహమ్మద్ సిరాజ్‌కు ఈ వికెట్‌పై మంచి రికార్డ్ ఉంది.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, అకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


