IND vs WI: 27 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన రవీంద్ర జడేజా.. మరో వికెట్ తీస్తే..!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే అప్‌కమింగ్ వన్డే సిరీస్‌లో ఒక వికెట్ తీస్తే రవీంద్ర జడేజా పేరిట వరల్డ్ రికార్డ్ నమోదవుతోంది. ఆదివారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. షై హోప్ నేతృత్వంలోని వెస్టిండీస్‌పై జామ్‌నగర్‌కు చెందిన ఈ 37 ఏళ్ల ఆల్‌రౌండర్ ఒక వికెట్ తీస్తే.. దిగ్గజ పేసర్ కోర్ట్నీ వాల్ష్ పేరిట ఉన్న రికార్డ్ బద్దలు అవుతుంది.
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌ల్లోవాల్ష్ 44 వికెట్లు పడగొట్టాడు. ఇరు దేశాల మధ్య జరిగిన వన్డే సిరీస్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. వాల్ష్ 1985 నుంచి 1999 మధ్య 38 వన్డేలు ఆడి ఈ ఫీట్ సాధించాడు. మరోవైపు రవీంద్ర జడేజా కేవలం 32 వన్డేల్లోనే 44 వికెట్లు పడగొట్టాడు. ఆదివారం జరిగే తొలి వన్డేలో వికెట్ తీస్తే వాల్ష్‌ను అధిగమిస్తాడు. జడేజా తర్వాత కపిల్ దేవ్ 42 మ్యాచ్‌ల్లో 43 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా.. అనిల్ కుంబ్లే 26 మ్యాచ్‌ల్లో 41 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

మహమ్మద్ షమీ 18 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు, వెస్టిండీస్ దిగ్గజ వివ్ రిచర్డ్స్ 31 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు, కార్ల్ హూపర్ 45 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 19 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు, హర్భజన్ సింగ్ 31 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ రికార్డ్ పాకిస్థాన్ దిగ్గజం, లెఫ్టార్మ్ పేసర్ వసీం అక్రమ్ పేరిట ఉంది.
అతను 1985 నుంచి 2002 మధ్య 64 మ్యాచ్‌ల్లో 89 వికెట్లు తీసాడు. అతని తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజం క్రెయిగ్ మెక్‌డెర్మాట్ 35 మ్యాచ్‌ల్లో 63 వికెట్లు, పాక్ దిగ్గజం వకార్ యూనిస్ 43 మ్యాచ్‌ల్లో 60 వికెట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. వన్డే చరిత్రలోనే ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన రికార్డ్ శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది.
అతను పాకిస్థాన్‌పై 65 వన్డేల్లో 96 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డే ఆడిన జడేజా.. సుదీర్ఘ విరామం తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటి వరకు జడేజా 210 వన్డేలు ఆడి 2,905 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో 95 పరుగులు చేస్తే 3 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


