Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: జపాన్ ఔట్.. క్వార్టర్ ఫైనల్లో భారత్‌తో అఫ్గాన్ ఢీ!

ఆసియా గేమ్స్ 2026లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. వర్షం పుణ్యమా అని అఫ్గానిస్థాన్‌ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జపాన్, నేపాల్ మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. వర్షం అంతరాయం కారణంగా ఈ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించగా.. నేపాల్ 4 వికెట్లకు 149 పరుగులు చేసింది.

నేపాల్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో ఆతిథ్య జపాన్ నిష్క్రమించగా.. గ్రూప్-ఏ నుంచి నేపాల్, అఫ్గాన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. రెండో స్థానంలో నిలిచిన అఫ్గానిస్థాన్.. క్వార్టర్ ఫైనల్లో భారత్‌తో తలపడనుంది.

Asian Games 2026 India Set to Face Afghanistan in Quarter-Final After Nepal-Japan Washout

మెరుగైన ఐసీసీ ర్యాంక్ కారణంగా భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న భారత్, అఫ్గాన్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మొదలవ్వనుంది.

Asian Games 2026: అఫ్గానిస్థాన్‌పై నేపాల్ సంచలన విజయం!

Asian Games 2026: అఫ్గానిస్థాన్‌పై నేపాల్ సంచలన విజయం!

సొంతగడ్డపై ఇటీవల అఫ్గానిస్థాన్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జపాన్ కండిషన్స్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటం.. వర్షా ప్రభావం పరిస్థితుల నేపథ్యంలో కచ్చితంగా భారత్ గెలుస్తుందని చెప్పే పరిస్థితులు లేవు. భారత్, అఫ్గాన్ క్వార్టర్ మ్యాచ్.. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఓటీటీ వేదికగా సోని లివ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా పసిడి సాధిస్తుందనే నమ్మకం అభిమానులకు ఉంది.

IND vs WI: శుభ్‌మన్ గిల్‌ను గాయపర్చిన సిరాజ్.. తొలి వన్డేకు కెప్టెన్ డౌట్!

Also Read

IND vs WI: శుభ్‌మన్ గిల్‌ను గాయపర్చిన సిరాజ్.. తొలి వన్డేకు కెప్టెన్ డౌట్!

ఆసియా గేమ్స్‌కు ఎంపికైన భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, విప్రజ్ నిగమ్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్.

Story first published: Saturday, September 26, 2026, 13:00 [IST]
Other articles published on Sep 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+