Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: కోహ్లీ, రోహిత్ మొదలెట్టారు.. ఇక దబిడి దిబిడే!

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా సన్నదమవుతోంది. ఆదివారం(సెప్టెంబర్ 27) తిరువనంతపురం వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ మూడు వన్డేల సిరీస్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఈ సిరీస్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు సన్నాహకాలను ప్రారంభించింది. తిరవనంతపురం వేదికగా గురువారం తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది.

IND vs JPN: ఓడినా.. వరల్డ్ బెస్ట్ టీమ్‌ను వణికించాం: జపాన్ కెప్టెన్

IND vs JPN: ఓడినా.. వరల్డ్ బెస్ట్ టీమ్‌ను వణికించాం: జపాన్ కెప్టెన్

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ చేశారు. అయితే ఈ ఇద్దరూ కలిసి ప్రాక్టీస్ చేయడం విశేషం. కోహ్లీ, గిల్, రుతురాజ్ వరుసగా నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేశారు. కోహ్లీ, రోహిత్‌లు ఒక నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం గమనార్హం. ఈ ఇద్దర్ని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ పర్యవేక్షించాడు. రోహిత్ శర్మకు పలు సూచనలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాసేపు ఫుట్‌బాల్ ఆడిన భారత ఆటగాళ్లు.. ఆ తర్వాత నెట్ సెషన్స్‌లో సాధన చేశారు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేస్తూ కనిపించాడు.

Virat Kohli and Rohit Sharma Start Practice Together Ahead of ODI Series Against West Indies

ఇంగ్లండ్ పర్యటనలో చివరిసారిగా ఆడిన కోహ్లీ, రోహిత్ సుదీర్ఘ విరామం తర్వాత ఈ సిరీస్‌తోనే మైదానంలోకి బరిలోకి దిగుతున్నారు. టీ20, టెస్ట్ ఫార్మాట్స్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా జట్టులో కొనసాగుతున్నారు. సొంతగడ్డపై తమకు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో సత్తా చాటాలని ఈ ఇద్దరూ భావిస్తున్నారు.

భారత్ X వెస్టిండీస్ వన్డే సిరీస్ షెడ్యూల్

తొలి వన్డే: సెప్టెంబర్ 27(ఆదివారం), తిరువనంతపురం, మధ్యాహ్నం 2 గంటలకు

రెండో వన్డే: సెప్టెంబర్ 30, గువాహతి, మధ్యాహ్నం 2 గంటలకు

మూడో వన్డే: అక్టోబర్ 3, న్యూ ఛండీఘడ్, మధ్యాహ్నం 2 గంటలకు

IND vs JPN: ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే త్రో.. బిత్తరపోయిన జపాన్ బ్యాటర్!(వీడియో)

Also Read

IND vs JPN: ఇషాన్ కిషన్ కళ్లు చెదిరే త్రో.. బిత్తరపోయిన జపాన్ బ్యాటర్!(వీడియో)

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు :

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, అకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్

Story first published: Thursday, September 24, 2026, 21:45 [IST]
Other articles published on Sep 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+