
క్రెడిట్ షమీదే..
ఇక ఈ విజయం క్రెడిట్ మహ్మద్ షమీదేనని, సూపర్ ఓవర్‌లో రోహిత్ బ్యాటింగ్ అద్భుతమని కోహ్లీ కొనియాడాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..
‘ఓదశలో మేం మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం. విలియమ్సన్(95) బ్యాటింగ్ అద్భుతం. కాకపోతే అతనికి నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ముందే ఊహించా. అందుకే చివరి బంతి వరకు పోరాడం. ఆఖరి బంతి వేసే ముందు చాలా చర్చించాం. స్టంప్స్ కొట్టేది మేమే.. విజయం మాదే అని భావించాం. ఇక రెండు ఇన్నింగ్స్‌లో (సూపర్ ఓవర్‌తో కలిపి) రోహిత్ బ్యాటింగ్ అద్భుతం. షమీ వేసిన చివరి రెండు బంతులు అత్యద్భుతం. ఒక్క భారీ షాట్ పడ్డా బౌలర్ ఒత్తిడికి లోనవుతారని తెలుసు. ఇక మేం 5-0తో క్లీన్ స్వీప్ దిశగా ప్రయత్నిస్తాం. అలాగే మా రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తాం. ఈ పరిస్థితుల్లో సుంధర్, సైనీ వంటి ఆటగాళ్లు ఎలా ఆడుతారో చూడాలనుకుంటున్నాం.'అని కోహ్లీ చివరి రెండు మ్యాచ్‌ల్లో చేయబోయే ప్రయోగాల గురించి హింట్ ఇచ్చాడు.
న్యూజిలాండ్‌కు కలిసిరాని సూపర్ ఓవర్.. వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత మూడోసారి.!

సూపర్ ఓవరి ఇదే ఫస్ట్ టైమ్..
ఇక ఈ మ్యాచ్‌ను తాను గెలిపించలేదని, మహ్మద్ షమీ గెలిపించాడని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సందర్భంగా తెలిపాడు. ‘సూపర్ ఓవర్‌లో ఇంతవరకెప్పుడు బ్యాటింగ్ చేయలేదు. అసలేం ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ముఖ్యంగా తొలి బంతి సింగిల్ తీసే ప్రయతంలో, మూడు, నాలుగు బంతుల తర్వాత ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. అయితే చివరి రెండు బంతుల వరకు నేను ఒక్కటే అనుకున్నా బౌలర్ తప్పిదం చేసేవరకు వేచిచూడాలని. ఆఖరి రెండుబంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు విజయాన్ని అందించడం ఆనందంగా ఉంది. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో అంతగా పరుగులు చేయలేదు. దీంతో ఈరోజు బాగా ఆడాలనుకుని సాధారణంగానే క్రీజులోకి వచ్చాను. పిచ్ కూడా బ్యాటింగ్‌కు చక్కగా సహకరించింది. అయితే ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కూడా సొంతమవుతుంది. అదే విధంగా రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు తర్వాతి మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని భావించాం. ఇక నా రెండు సిక్స్‌లు కన్నా మహ్మద్ షమీనే ఈ మ్యాచ్‌ను గెలిపించాడు. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
IND vs NZ, 3rd T20I: ఉత్కం‘టై'.. సూపర్ ఓవర్ సాగిందిలా..

రోహిత్ హాఫ్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత జట్టులో రోహిత్ శర్మ(65) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(38), కేఎల్ రాహుల్(27)లు ఫరవాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో బెన్నట్ మూడు వికెట్లు పడగొట్టగా... శాంట్నర్, గ్రాండ్‌హోమ్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగుల చేసింది. భారత బౌలర్లలో ఠాకూర్, షమి రెండేసి వికెట్లు తీసుకోగా.. చాహల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు.


Click it and Unblock the Notifications












