For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ, 3rd T20I: ఉత్కం‘టై’.. సూపర్ ఓవర్ సాగిందిలా..

India vs New Zealand 3rd T20 : Super Over Highlights | Rohit Sharma | KL Rahul || Oneindia Telugu
Kane Williamson 95 in vain as India win Super Over to take unbeatable 3-0 lead in T20I series vs New Zealand

హామిల్టన్ : భారత్-న్యూజిలాండ్‌ మధ్య అత్యంత ఉత్కంఠగా సాగిన మూడో టీ20 ఫలితాన్ని చివరకు సూపర్ ఓవర్ నిర్ణయించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. నాలుగు బంతుల్లో 2 పరుగులు చేయలేక చేతులెత్తేసిన న్యూజిలాండ్ టైతో తన ఇన్నింగ్స్ ముగించింది. దీంతో సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. ఆద్యాంతం ఉత్కంఠగా.. సాగిన ఈ సూపర్ ఓవర్‌లో ఒక్కో బంతి ఒక్కో గుండెను తట్టిలేపింది.. ఒక్కోక్క పరుగు భావోద్వేగాన్ని మెలివేసింది.

సూపర్ ఓవర్‌లో ఛేజింగ్ టీమ్‌గా న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్టిల్ క్రీజులోకి వచ్చాడు. ఇక అటు జస్ప్రిత్ బుమ్రా బంతినందుకున్నాడు.

న్యూజిలాండ్ సూపర్ ఓవర్ బ్యాటింగ్...
తొలి బంతి : 1-మిడ్ వికెట్ మీదుగా ఆడిన విలియమ్సన్ ఒక పరుగు రాబట్టాడు.
రెండో బంతి : 1-బుమ్రా వేసిన ఫుల్ టాస్‌ను గప్టిల్ ఆఫ్ వికెట్ మీదుగా లాంగాఫ్ దిశగా షాట్ ఆడాడు. కానీ సింగిల్ మాత్రమే వచ్చింది.
మూడో బంతి: 6-ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని విలియమ్సన్ స్క్వేర్ లెగ్ బౌండరీ దిశగా భారీ షాట్‌తో అద్భు సిక్సర్‌గా మలిచాడు.
నాలుగో బంతి: 4- ఫుల్ టాస్ బాల్‌ను విలిమమ్సన్ అద్భుతంగా స్కూప్ షాట్‌తో బౌండరీకి తరలించాడు.
ఐదో బంతి: 1- ఔట్ సైడ్ ఆఫ్‌గా వేసిన బంతి విలియమ్సన్ కట్ చేయబోయాడు. కానీ బంతి బ్యాట్‌కు తగలలేదు. వెంటనే విలియమ్సన్ పరుగు కోసం ప్రయత్నించగా.. బంతినందుకున్న రాహుల్ రనౌట్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో బైస్ రూపంలో 1 పరుగు వచ్చింది.
ఆరో బంతి: 4- ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన లోఫుల్ టాస్‌ను డీప్ వికెట్ మీదుగా గప్టిల్ బౌండరీగా మలిచాడు.
మొత్తం: 17

6 బంతుల్లో మొత్తం 17 పరుగులు చేసిన న్యూజిలాండ్ 18 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశింది. అనంతరం భారత్‌ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో ఛేజింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ స్ట్రైకింగ్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ పేసర్ సౌథి బంతినందుకున్నాడు.

భారత్ సూపర్ ఓవర్..
తొలి బంతి : 2-ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన బంతిని రోహిత్ డీప్ వికెట్ మీదుగా ఆడాడు. అయితే సింగిల్ తీసిన తర్వాత పెద్ద డ్రామా చోటు చేసుకుంది. రాహుల్ రెండో పరుగు తీయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ రోహిత్ పరుగెత్తుకొచ్చాడు. అయితే ఫీల్డర్ తప్పుతో రనౌటయ్యే చాన్స్ చేజారింది.

తొలి బంతి : 2-ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన బంతిని రోహిత్ డీప్ వికెట్ మీదుగా ఆడాడు. అయితే సింగిల్ తీసిన తర్వాత పెద్ద డ్రామా చోటు చేసుకుంది. రాహుల్ రెండో పరుగు తీయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ రోహిత్ పరుగెత్తుకొచ్చాడు. అయితే ఫీల్డర్ తప్పిదంతో రనౌటయ్యే చాన్స్ నుంచి ఈ జోడీ గట్టెక్కింది.

రెండో బంతి: 1-ఆఫ్ స్టంప్ మీదుగా మరో బంతి వేయగా రోహిత్ డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా ఆడి సింగిల్ తీశాడు.
మూడో బంతి : 4- ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన లో ఫుల్ టాస్‌ను రాహుల్ ఫైన్ లెగ్, డీప్ స్క్వేర్ మధ్యలో అద్భుత స్వీప్ షాట్‌తో బౌండరీకి తరలించాడు.
నాలుగో బంతి : 1-లాంగాన్ దిశగా ఆడిన రాహుల్ సింగిల్ తీశాడు.
ఐదో బంతి : 6- సౌథి యార్కర్ వేసే ప్రయత్నం విఫలమై బంతి నేరుగా రోహిత్ బ్యాట్ మీదుకు వెళ్లగా అతను అద్భుతంగా సిక్సర్ కొట్టాడు.
ఆరో బంతి : 6- చివరి బంతికి 4 పరుగులు చేస్తేనే గెలుపు లేకుంటే ఓటమి ఖాయం అన్న పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ.. రోహిత్ క్రీజు నుంచి ముందకు వచ్చి అద్భుతంగా సిక్స్ కొట్టాడు.
మొత్తం: 18
ఈ సూపర్ ఓవర్ సూపర్ గేమ్‌తో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్‌ను 3-0తో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే గెలుచుకుంది. ఫలితంగా కివీస్ గడ్డపై భారత్ తొలి సారి టీ20 సిరిస్ నెగ్గింది. హాఫ్ సెంచరీతో పాటు సూపర్ ఓవర్ సూపర్ బ్యాటింగ్‌తో విజయాన్నందించిన రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. భారత జట్టులో రోహిత్ శర్మ(65) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(38), కేఎల్ రాహుల్(27)లు ఫరవాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో బెన్నట్ మూడు వికెట్లు పడగొట్టగా... శాంట్నర్, గ్రాండ్‌హోమ్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగుల చేసింది. భారత బౌలర్లలో ఠాకూర్, షమి రెండేసి వికెట్లు తీసుకోగా.. చాహల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు.

Story first published: Wednesday, January 29, 2020, 19:31 [IST]
Other articles published on Jan 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+