For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌కు కలిసిరాని సూపర్ ఓవర్.. వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత మూడోసారి.!

India inflict Super Over heartbreak on New Zealand: 6 losses in 7 tie-breakers

హామిల్టన్: న్యూజిలాండ్‌కు సూపర్ ఓవర్ ఏ మాత్రం కలిసి రావడం లేదు. గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సూపర్‌ ఓవర్‌తోనే కివీస్ విశ్వటైటిల్‌ను చేజార్చుకుంది. ఆ సూపర్ ఓవర్ టైగా ముగిసినా బౌండరీల నిబంధన ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపింది. ఆ మ్యాచ్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. న్యూజిలాండ్ ఓడినా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇక అప్పటి నుంచి ఈ సూపర్ ఓవర్.. బ్లాక్ క్యాప్స్‌ను నీడలా వెంటాడుతోంది. ఆ మ్యాచ్‌తో కలుపుకొని బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌ వరకు ఆరునెలల్లో మూడు సూపర్ ఓవర్లు ఆడిన న్యూజిలాండ్ మూడింట పరాజయాన్నే చవిచూసింది.

వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం నవంబర్‌లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడిన కివీస్.. ఆక్లాండ్ వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లోనే పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 146 పరుగులే చేయగా.. అనంతరం ఇంగ్లండ్ కూడా 146 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్‌లో ఇంగ్లండ్ 17 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ ఏడు పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఇప్పుడు తాజాగా భారత్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా టై చేసుకొని రోహిత్ ధాటికి సూపర్ ఓవర్‌లోనే ఓటమిపాలైంది.

ఇక అంతర్జాతీయ టీ20ల్లో మొత్తం ఏడు సార్లు సూపర్ ఓవర్ ఆడిన న్యూజిలాండ్ 6 సార్లు ఓడి కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. 2008 ఆస్ట్రేలియాపై గెలిచిన తర్వాత ఇప్పటి వరకు సూపర్ ఓవర్‌లో కివీస్ గెలవలేదు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి సూపర్ ఓవర్ ఆడిన బ్లాక్ క్యాప్స్.. అత్యధిక సార్లు ఆడిన జట్టుగా కూడా రికార్డుకెక్కింది.

1. వెస్టిండీస్‌తో తొలిసారి..
2006లో తొలి సారి వెస్టిండీస్‌తో టై చేసుకున్న న్యూజిలాండ్‌ బౌల్ ఔట్‌లో 3-0తో ఓటమిపాలైంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు 126 పరుగులే చేశాయి. ఇక పొట్టి ఫార్మాట్‌లో ఇదే తొలి టై మ్యాచ్ కావడం విశేషం. అనంతరం సూపర్ ఓవర్ విధానం ప్రవేశ పెట్టిన తర్వాత టీ20ల్లో ఎక్కువగా సూపర్ ఓవర్లు ఆడిన.. ఓడిన జట్టు న్యూజిలాండే కావడం విశేషం.

2.వెస్టిండిస్ చేతిలో రెండో సారి(2008లో)
2008 డిసెంబర్‌లో ఆక్లాండ్ వేదికగానే మరోసారి వెస్టిండిస్‌తో టై చేసుకున్న న్యూజిలాండ్.. సూపర్ ఓవర్‌లోనే ఓటమిపాలైంది. ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో 155 పరుగులే చేయడంతో(కివీస్ 155/7, వెస్టిండీస్ 155/8) సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్‌లో విండీస్ ఒక వికెట్ కోల్పోయి 25 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 2 వికెట్లకు 15 పరుగులే చేసి ఓటమిపాలైంది.

3.ఆస్ట్రేలియాపై విజయం..
2008 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఇరు జట్లు(న్యూజిలాండ్ 214/6, ఆసీస్ 214/4) 214 పరుగులే చేశాయి. ఇక సూపర్ ఓవర్‌లో కివీస్ వికెట్ పోకుండా 9 పరుగులు చేయగా.. ఆసీస్ ఒక వికెట్ కోల్పోయి 6 పరుగులే చేసి ఓటమిపాలైంది.ఈ ఒక్క సూపర్ ఓవర్‌లోనే న్యూజిలాండ్ గెలిచింది.

4. శ్రీలంకపై ఓటమి..
2012 సెప్టెంబర్‌లో శ్రీలంకతో జరిగిన ఓ టీ20లో న్యూజిలాండ్ సూపర్ ఓవర్‌లోనే ఓటమిపాలైంది. ఇరుజట్లు 174 పరుగులు చేయగా(కివీస్ 174/7, శ్రీలంక 174/6) ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు. శ్రీలంక 13/1 చేయగా.. న్యూజిలాండ్ 7/1కే పరిమితమై ఓటమిపాలైంది.

5. వెస్టెండీస్‌పై ఇంకోసారి..
2012 అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో న్యూజిలాండ్ సూపర్ ఓవర్‌తోనే ఓటమిపాలైంది. ఇరు జట్లు(వెస్టిండీస్ 139 ఆలౌట్, న్యూజిలాండ్ 139/7) 139 పరుగులే చేయడంతో టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో విండీస్ 19/0 చేయగా.. న్యూజిలాండ్ 17/0 కే పరిమితమై ఓటమిపాలైంది.

6. వరల్డ్ కప్ అనంతరం ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌లో ఓడింది. (ఇంగ్లండ్ 11 ఓవర్లలో 146/5, న్యూజిలాండ్ 11 ఓవర్లలో 146/5), సూపర్ ఓవర్ ఇంగ్లండ్ 17/0, న్యూజిలాండ్ 8/1

7. తాజా భారత్‌తో ఓటమి.(న్యూజిలాండ్ 17/0, భారత్ 20/0)

Story first published: Wednesday, January 29, 2020, 19:23 [IST]
Other articles published on Jan 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+