For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓయ్ కోహ్లీ ఇంత బాధ్యతారాహిత్యమా? బబుల్‌లో ఉంటేనే కరోనా వస్తుంది! మీరేమో చెట్టాపట్టాలేసుకొని...

Virat Kohli And Co. Irresponsiblity: What If Covid Impact The Indian Team

న్యూఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-22‌లో జరిగే ఫస్ట్ సిరీస్ ఇదే కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కానీ భారత ఆటగాళ్లకే కరోనా కాలంలో ఉన్నామనే సోయే లేకుండా పోయింది. ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో ఎదురైన సమస్యలు గురించి తెలుసుకొని కూడా బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ప్రతిష్టాత్మక సిరీస్ పెట్టుకొని ఫొటో షూట్స్ అంటూ నిర్లక్ష్యంగా ఎంజాయ్ చేస్తున్నారు.

సిరీస్ ముంగిట ఫొటో షూట్స్..

తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్ తమ సతీమణులతో కలిసి సరదాగా గడిపారు. ఫొటో షూట్ కూడా నిర్వహించారు. ఈ ఫొటోలను కే.ఎల్​ రాహుల్​ తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో షేర్​ చేశాడు. కొన్ని ఫొటోల్లో విరాట్​ కోహ్లీ స్టైలిష్​ లుక్స్​తో అదరగొట్టాడు. ఇంకో ఫొటోలో ఉమేశ్​ యాదవ్​, విరాట్​, కేఎల్​ రాహుల్​, ఇషాంత్​ శర్మ, మయాంక్​ అగర్వాల్​ కనపడ్డారు. అయితే ఈ పిక్​ షేర్​ చేస్తూ.. "ఈ ఫొటో తీసింది ఎవరో తెలుసా?" అన్న క్యాప్షన్​ జోడించాడు రాహుల్​. అనంతరం విరాట్​ సతీమణి అనుష్క శర్మ, రాహుల్​ గర్ల్​ఫ్రండ్​, నటి అథియా శెట్టి ఫొటో తీస్తున్న పిక్​ను షేర్​ చేసింది. ఆ ఫొటోలో ఉమేశ్​ భార్య తన్యా వాద్వా, ఇషాంత్​ సతీమణి ప్రతిమా సింగ్​, బీసీసీఐ మీడియా బృందం సీనియర్​ ప్రొడ్యూసర్​ రాజల్​ ఆరోరా కూడా ఇందులో ఉన్నారు.

Tokyo 2020: అందుకే బాక్సింగ్‌లో ఇద్దరికీ బ్రాంజ్ మెడల్!

బుద్ది రాలేదు..

అయితే ఈ ఫొటోలను చూసిన అభిమానులు చిర్రెత్తుకుపోతున్నారు. అసలు బయో బబుల్‌లో ఉన్న వీళ్లకు ఇలా సరదాగా గడిపే అవకాశం ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. కఠిన బయో బబుల్‌లో ఉంటేనే వైరస్ ఆటగాళ్లకు సోకుతుందని, ఐపీఎల్ 2021 సీజన్, శ్రీలంక పర్యటనలో ఇదే జరిగిందని, కానీ భారత ఆటగాళ్లు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. శ్రీలంక పర్యటనలో కృనాల్ పాండ్యా ఒక్కడికి కరోనా రావడం వల్ల సిరీస్ కోల్పోవాల్సి వచ్చిందని, బలహీనమైన శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడి పరువు పోయిందని గుర్తు చేస్తున్నారు. అయితే ఇంగ్లండ్ పర్యటనలోని భారత ఆటగాళ్లకు బుద్ది రాలేదని ఘాటుగా విమర్శిస్తున్నారు.

IPL 2021: ఆర్‌సీబీలోకి వరల్డ్ నెంబర్ 2 బౌలర్!

బీసీసీఐ కూడా..

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా ఏ ఆటగాడికైనా కరోనా సోకితే పరిస్థితి ఏంటని, అప్పుడు భారత ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదిస్తున్నారు. అసలు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా ఆటగాళ్లకు స్వేచ్చనిస్తూందని, ఓ రకంగా విరాట్ కోహ్లీ ఏదంటే దానికే తలూపుతుందని విమర్శిస్తున్నారు. కఠిన బయోబబుల్‌లో ఉంటేనే కరోనా వస్తుందని, అలాంటిది వీరేమో చెట్టాపట్టాలేసుకొని తిరిగొస్తున్నారని మండిపడుతున్నారు. ఆటపై దృష్టి పెట్టి.. విజయాలు సాధించక ఎంజాయ్ చేయాలని సూచిస్తున్నారు. ఇక ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ ట్రెంట్​ బ్రిడ్జ్​ వేదికగా ఆగస్టు 4న ప్రారంభం అవుతుంది. రెండో టెస్టు లార్డ్స్​ వేదికగా ఆగస్టు 12 నుంచి జరగనుంది.

Story first published: Saturday, July 31, 2021, 14:02 [IST]
Other articles published on Jul 31, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+