Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సుద్దపూసలా నటిస్తున్నాడు.. ఎలాన్ మస్క్‌పై మాజీ క్రికెటర్ ఫైర్!

భారత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలాన్ మస్క్ కంటే స్వార్థపరుడు మరొకరు ఉండరని విమర్శించాడు. టెస్లాకు ఎక్కడ పోటీ అవుతుందోనని బీవైడీ కంపెనీని అమెరికాలోకి రాకుండా అడ్డుకున్న ఎలాన్ మస్క్.. భారత్ విషయంలో మాత్రం సుద్దపూస సూక్తులు చెబుతున్నాడని మండిపడ్డాడు.

స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో అనుమతుల ఇవ్వకుండా జాప్యంపై చేయడంపై ఎలాన్ మస్క్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీని ఉద్దేశించి ఎలాన్ మస్క్ ఎక్స్‌వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవల రంగంలో అంబానీ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు. భారత ప్రధాని అంబానీ అంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు పేల్చారు.

నా వైఫల్యానికి నేనే కారణం.. ఎవర్ని నిందించను: సంజూ శాంసన్

నా వైఫల్యానికి నేనే కారణం.. ఎవర్ని నిందించను: సంజూ శాంసన్

ప్రధాని అంబానీ గారూ..

'ప్రియమైన ప్రధాని అంబానీ, భారత్‌కు మీరు నిజమైన బాస్ అని తెలుసుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి. భారత్ వంటి గొప్ప దేశ ప్రజలను దోచుకోవడంలో మీ గుత్తాధిపత్యం కొనసాగాలనే కదా మీరు కోరుకుంటారు. అలాంటప్పుడు స్టార్ లింక్‌ను భారత్‌లో పోటీకి అనుమతిస్తారా?'అని ఎక్స్ వేదికగా సెటైర్లు పేల్చాడు. ఇతర దేశాల్లో మాదిరిగానే భారత్‌లోనూ అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు లేవని, ఆ లోటు స్టార్ లింక్ తీరుస్తుందని చెప్పారు. ప్రకృతివిపత్తుల సమయంలోనూ సేవలు అందించగలదని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Venkatesh Prasad Slams Elon Musk After Remarks on India s Satellite Internet Regulations

ఎలాన్ మస్క్ సెటైర్లపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఏ రంగంలోనూ గుత్తాధిపత్యానికి భారత్ అంగీకరించబోదని, ఇప్పటికే మూడు కంపెనీలు లైసెన్సులు పొందాయని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్ వేదికగా బదులిచ్చారు.

IND vs WI: ఇవేం పిచ్‌లు రా అయ్యా..రోత పుడుతుంది!

Also Read

IND vs WI: ఇవేం పిచ్‌లు రా అయ్యా..రోత పుడుతుంది!

సుద్దపూస సూక్తులు..

తాజాగా ఎలాన్ మస్క్‌‌పై భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. 'తన టెస్లా కార్ల సేల్స్ ఎక్కడ పడిపోతాయో అన్న భయంతో బివైడి (BYD) కంపెనీని అమెరికాలోకి రాకుండా అడ్డుకున్న ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్ ప్రవర్తన అస్సలు బాలేదు. కానీ భారత్‌కు వచ్చేసరికి మన జాతీయ భద్రతా హక్కుల గురించి మాట్లాడి అనవసరంగా రచ్చ చేస్తున్నాడు.

అతను గొప్ప వ్యాపారవేత్తే. నేను కాదనను. కానీ మనస్సులో చాలా ఈర్ష్య, కసి ఉన్న వ్యక్తి. అంతకుముందు ట్రంప్ పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉందని వెంటపడ్డాడు. తీరా తన వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలిసి సైలెంట్ అయిపోయాడు. లొల్ మస్క్.'అని ట్వీట్ చేశాడు. భారత్ తరఫున 33 టెస్ట్‌లు, 161 వన్డేలు ఆడిన వెంకటేష్ ప్రసాద్.. 96, 196 వికెట్లు పడగొట్టాడు. 1990ల కాలంలో జవగల్ శ్రీనాథ్ - వెంకటేష్ ప్రసాద్‌ జోడీ భారత పేస్ బౌలింగ్ విభాగానికి ప్రధాన బలంగా ఉండేది.

Story first published: Saturday, October 10, 2026, 18:17 [IST]
Other articles published on Oct 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+