Vaibhav Sooryavanshi: బ్యాటింగ్, బౌలింగే కాదు.. డీఆర్‌ఎస్‌లోనూ బుడ్డోడు కింగే! (వీడియో)
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు.. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో డీఆర్‌ఎస్ కింగ్‌గా నిలిచాడు. రెండు డీఆర్‌ఎస్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించి అంపైర్ల నిర్ణయాలు తప్పని తేల్చాడు.
ఇదే టోర్నీలో బౌలర్‌గా 4 బంతుల్లో రెండు వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ.. తాజా ఫైనల్లో పట్టుబట్టి డీఆర్‌ఎస్ తీసుకొని మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ డీఆర్‌ఎస్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైభవ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. డీఆర్ఎస్ కాదు.. వీఆర్‌ఎస్( వైభవ్ రివ్యూ సిస్టమ్) అని కొనియాడుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ముఖేష్ కుమార్ వేసిన 6వ ఓవర్‌లో రికీ భూయ్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ చేతిలో పడింది. వెంటనే ఈస్ట్ జోన్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటివ్వలేదు. దాంతో రివ్యూ తీసుకోవాలని వైభవ్ సూర్యవంశీ.. ఇషాన్ కిషన్‌కు చెప్పాడు. లే లో.. లే లో అని హిందీలో అనడం స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యింది. రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నట్లు తేలడంతో ఈస్ట్ జోన్ ఆటగాళ్లు ఎగిరి గంతేసారు. వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా అభినందించారు.

ఆ తర్వాత ఇషాన్ కిషన్ మైదానం వీడగా.. వైభవ్ సూర్యవంశీ జట్టును నడిపించాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో స్మరణ్ రవిచంద్రన్ బ్యాట్‌ను కూడా బంతి ఎడ్జ్ అయి కీపర్ చేతిలో పడింది. అంపైర్ ఔటివ్వకపోవడంతో తాత్కలిక కెప్టెన్‌గా ఉన్న వైభవ్ సూర్యవంశీ ఏ మాత్రం ఆలోచించకుండా రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ అయినట్లు తేలడంతో ఈస్ట్ జోన్ ఆటగాళ్లు సంతోషానికి గురయ్యారు. వైభవ్‌ను ప్రత్యేకంగా కొనియాడుతూ కనిపించారు.
సెమీఫైనల్లోనూ..
ఇదే టోర్నీలో సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లో వైభవ్ సూర్యవంశీ ఇలానే ఓ డీఆర్‌ఎస్ తీసుకోని ఫలితం రాబట్టాడు. బెంగళూరులోని సీఓఈలో జరిగిన ఆ మ్యాచ్‌లో.. సెంట్రల్ జోన్ బ్యాటర్ ఆర్యన్ జుయాల్ వికెట్‌ను డీఆర్‌ఎస్ ద్వారా వైభవ్ రాబట్టాడు. ఆ సమయంలో ఇషాన్ కిషన్ మైదానంలో లేకపోవడంతో వైభవ్ సూర్యవంశీనే తాత్కలిక కెప్టెన్‌గా ఈ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. దాంతో మూడు డీఆర్‌ఎస్‌లు సక్సెస్ కావడంతో వైభవ్ డీఆర్‌ఎస్ కింగ్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
కష్టాల్లో సౌత్ జోన్..
ఈస్ట్ జోన్ నిర్దేశించిన 708 పరుగుల భారీ స్కోర్‌ను అధిగమించేందుకు బరిలోకి దిగిన సౌత్ జోన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 240 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగుతోంది. ఓపెనర్లు రికీ భుయ్(1), నారయణ్ జగదీషన్(32), షేక్ రషీద్(27) తీవ్రంగా నిరాశపర్చగా.. భారీ అంచనాలతో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్(62) హాఫ్ సెంచరీతోనే సరిపెట్టుకున్నాడు. రవిచంద్రన్ స్మరణ్(23), శ్రేయస్ గోపాల్(26) కూడా వెనుదిరగడంతో చామ మిలింద్(2)తో కలిసి తిలక్ వర్మ(56 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. సౌత్ జోన్ ఇంకా 466 పరుగుల వెనుకంజలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


