Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral Video: వైభవ్ సూర్యవంశీ vs తిలక్ వర్మ.. డిష్యూం.. డిష్యూం! (వీడియో)

Viral Video: దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యర్థి సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మకు మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మొదట సరదాగా స్లెడ్జింగ్‌తో ప్రారంభమైన వారిద్దరి మధ్య సంభాషణ అకస్మాత్తుగా తీవ్ర వాగ్వాదంగా మారింది. పరిస్థితి ఎంతగా ముదిరిందంటే దాన్ని చక్కదిద్దడానికి అంపైర్లు జోక్యం చేసుకోవలసి వచ్చింది.

IND vs PAK: చేసింది తొక్కలో 55 రన్స్.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! (వీడియో)

IND vs PAK: చేసింది తొక్కలో 55 రన్స్.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! (వీడియో)

ఈస్ట్ జోన్ తోలి ఇన్నింగ్స్‌లోని 11వ ఓవర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ వైభవ్ సూర్యవంశీతో ఎక్కువగా మాట్లాడుతూ వైస్ కెప్టెన్సీ గురించి అతడిని స్లెడ్జింగ్ కూడా చేశాడు. కొద్ది‌సేపటికే ఆ స్లెడ్జింగ్ తీవ్ర వాగ్వాదంగా మారింది. తిలక్ వర్మ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వైపు వెళ్లి అతడిని గుద్దబోతున్నట్లుగా చిన్న సైగ చేశాడు. వైభవ్ సూర్యవంశీ వెనక్కి తగ్గకుండా వెంటనే అతడిని ఎదుర్కొన్నాడు. వారిద్దరి మధ్య ఉద్రిక్తత పెరగడం చూసి అంపైర్ జోక్యం చేసుకుని ఆటగాళ్లను విడదీశాడు.

Duleep Trophy 2026 Vaibhav Sooryavanshi and Tilak Varma On-Field Clash Video Goes Viral Full Details

తిలక్ వర్మతో మైదానంలో వాగ్వాదానికి దిగకముందే వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఈస్ట్ జోన్ కు పటిష్టమైన ఆరంభాన్ని అందించాడు. వైభవ్ సూర్యవంశీ కేవలమ 37 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు.

అయితే ఫాస్ట్ బౌలర్ చామ మిలింద్ వైభవ్ సూర్యవంశీ హాఫ్ పూర్తి చేయకముందే ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. వైభవ్ సూర్యవంశీ ఓ షార్ట్ డెలివరీని భార్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి అదనంగా బౌన్స్ అవ్వడంతో అది వైభవ్ బ్యాట్ పైభాగానికి తగిలి మిడ్-వికెట్ వైపు వెళ్లింది. డీప్ స్క్వేర్ లెగ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన తానయ్ త్యాగరాజన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.

IND vs PAK: పాక్‌పై ఏకపక్ష విజయం.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమన్నారంటే?

Also Read

IND vs PAK: పాక్‌పై ఏకపక్ష విజయం.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమన్నారంటే?

వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ 44 పరుగుల వద్ద ముగిసినప్పటికీ.. అతను రెడ్-బాల్ క్రికెట్లో తన బ్యాటింగ్‌కు ఓ కొత్త కోణాన్ని అందించాడు. సెమీ-ఫైనల్స్‌లో 92, 40 పరుగులు చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఫైనల్లో కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు దులీప్ ట్రోఫీ తర్వాత వైభవ్ సూర్యవంశీ భారత జట్టుతో తన తదుపరి బాధ్యత కోసం ఎదురుచూస్తున్నాడు. వైభవ్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.

Story first published: Sunday, September 6, 2026, 15:06 [IST]
Other articles published on Sep 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+