Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ కోసమే నా సతీమణి క్రికెట్ చూస్తోంది: క్రిష్ శ్రీకాంత్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ 15 ఏళ్ల కుర్రాడు తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడని కొనియాడాడు. వైభవ్ సూర్యవంశీ కోసమే జనాలు దులీప్ ట్రోఫీని చూస్తున్నారని, అందులో తన సతీమణి కూడా ఉందని పేర్కొన్నాడు.

ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తనకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

తిలక్ వర్మ X వైభవ్ సూర్యవంశీ.. 54 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.!

తిలక్ వర్మ X వైభవ్ సూర్యవంశీ.. 54 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.!

'వైభవ్ సూర్యవంశీ ఆట అత్యద్భుతం. అతన్ని నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఈ కుర్రాడిని జాగ్రత్తగా చూసుకుంటే రాబోయే కాలంలో సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడు. టెస్ట్‌ క్రికెట్‌కూ పూర్వ వైభవం తీసుకొస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దులీప్ ట్రోఫీ చూడటానికి కూడా కారణం అతనే. నా సతీమణి కూడా వైభవ్ ఉన్నాడనే మ్యాచ్‌లు చూస్తోంది. ప్రపంచ క్రికెట్‌కు అతను పెద్ద ఆస్తిగా మారుతాడు.

Kris Srikkanth Says Vaibhav Sooryavanshi Is Making Cricket Exciting Again Even My Wife Is Watching

దేశవాళీలోనూ వైభవ్ ఆటను చూశాం కదా. ఇలాంటి కుర్రాడికి ఉన్నత స్థాయి క్రికెట్ ఆడగల సామర్థ్యం ఉందా? అని ఎవరైనా సందేహిస్తారా? అతను ఎక్కడైనా ఆడగలడు. త్వరలోనే అన్ని ఫార్మాట్లలో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు. రెడ్‌బాల్ క్రికెట్‌లోనూ పేస్ బౌలింగ్‌లో ఏ మాత్రం భయం లేకుండా స్ట్రెయిట్ సిక్స్‌లు కొట్టడం అద్భుతం.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

Vaibhav Sooryavanshi: బుడ్డోడా మజాకా.. 57 ఏళ్ల రికార్డ్ బద్దలు!

Also Read

Vaibhav Sooryavanshi: బుడ్డోడా మజాకా.. 57 ఏళ్ల రికార్డ్ బద్దలు!

సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లో వన్డే తరహా బ్యాటింగ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు బాదిన వైభవ్ సూర్యవంశీ(92) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిన పరిస్థితుల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈస్ట్ జోన్ విజయాన్ని సునాయసం చేశాడు. 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌ చేరింది. ఆదివారం నుంచి సౌత్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య చెన్నై వేదికగా ఫైనల్ జరగనుంది.

Story first published: Saturday, September 5, 2026, 10:46 [IST]
Other articles published on Sep 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+