Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: తుది జట్టులో దక్కని చోటు.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర పోస్ట్!

భారత్ వర్సెస్ వెస్టిండీస్ ఆఖరి టీ20కి ముందు టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఈ 15 ఏళ్ల కుర్రాడికి అవకాశం దక్కని సంగతి తెలిసిందే. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగుతుండటంతో ఈ కుర్రాడికి అవకాశం లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే బెంగళూరు వేదికగా నేడు(శనివారం) జరిగే ఆఖరి టీ20లోనైనా వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా? లేదా? అనేది సందేహంగా మారింది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలవడంతో ఆఖరి మ్యాచ్ డిసైడర్‌గా మారింది. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్‌ను ఆడిస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

IND vs ZIM: ఆమె వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: స్మృతి మంధాన

IND vs ZIM: ఆమె వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: స్మృతి మంధాన

ఇప్పటికీ నమ్మకంతోనే ఉన్నా..

మరోవైపు వైభవ్ సూర్యవంశీ మాత్రం తనకు అవకాశం వస్తుందనే నమ్ముతున్నానని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. 'ఇప్పటికీ నమ్మకంతోనే ఉన్నా'అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టతనిచ్చాడు. వైభవ్ కోసం ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్‌ను విడదీయలేనని చెప్పాడు.

Vaibhav Sooryavanshi Shares Two-Word Post After Being Benched for First Four T20Is Against West Indies

'వైభవ్ మంచి ఫామ్‌లో ఉన్న మాట వాస్తవమే. కానీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే కెప్టెన్, కోచ్ తుది జట్టు ఎంపికపై నిర్ణయం తీసుకుంటారు. వైభవ్‌ను ఆడిస్తే.. అభిషేక్, సంజూ శాంసన్‌లో ఎవరిని తప్పించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడం కష్టమవుతోంది. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ ఓపెనింగ్ కాంబినేషన్‌ను ఉన్నట్టుండి మార్చేయలేం కదా?'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

గంభీర్.. ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడు: వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్

Also Read

గంభీర్.. ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడు: వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్

వాటర్ బాయ్‌గానే..

ప్రతిభకు లోటు లేకున్నా టీమ్ కాంబినేషన్‌లో భాగంగా వైభవ్‌కు అవకాశం రావడం లేదు. దాంతో అతను వాటర్ బాయ్‌గా జట్టుకు సేవలందిస్తున్నాడు. ఇప్పటికే భారత్ సిరీస్ గెలిచి ఉంటే ఆఖరి మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం దక్కేది. కానీ ఇప్పుడు అతన్ని ఆడించలేని పరిస్థితి నెలకొంది. అభిషేక్, సంజూ శాంసన్ చెరో రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. వైభవ్‌ను ఆడించాలనుకుంటే అభిషేక్ శర్మకు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. టీమిండియా మేనేజ్‌మెంట్ అలా చేస్తుందో లేదో చూడాలి.

Story first published: Saturday, October 17, 2026, 11:20 [IST]
Other articles published on Oct 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+