గంభీర్.. ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడు: వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత జట్టులో గంభీర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డాడు.
వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. వైభవ్ తుఫాన్ లాంటి వాడని, అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించేవారు ఈ రోజు కాకపోయినా.. రేపైనా కొట్టుకుపోతారని హెచ్చరించాడు.
సంజూ కోసం వైభవ్‌కు అన్యాయం..
వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కలేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో వైభవ్‌కు అవకాశం లేకుండా పోయింది. వైభవ్ ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని ఇప్పటికే గంభీర్ స్పష్టం చేశాడు.

అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను కాదని సంజూను ఆడించడం ఏంటని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. సంజూ శాంసన్ నిలకడలేమి ప్రదర్శనతో సతమతమవుతున్నా... అతనికి వరుసగా అవకాశాలు ఇస్తున్నారు.
అవకాశం ఇవ్వకుండా ఎలా డెవలప్ చేస్తారు..?
ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా.. గంభీర్ తీరును తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ' టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు మేనేజ్‌మెంట్ నిరంకుశంగా వ్యవహరిస్తోంది. వారికి తోచినట్లు వారు చేస్తున్నారు.
ఆటగాళ్లను బెంచ్‌పై ఉంచడం ద్వారా వారిని తీర్చిదిద్దవచ్చని ఈ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టుంది. ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా వారిని డెవలప్ చేయడం చాలా కష్టం. భవిష్యత్ కోసం ఆటగాళ్లను సిద్ధం చేయాలంటే ముందు వారిని క్లిష్ట పరిస్థితుల్లో ఆడే అవకాశం కల్పించాలి.
కొట్టుకుపోతారు..
కానీ మేనేజ్‌మెంట్ చేస్తున్నదేంటి? ముఖ్యంగా వైభవ్‌లాంటి అరుదైన ప్రతిభావంతులను బెంచీపై కూర్చోబెట్టడం దురదృష్టకరం. బహుశా ఈ కుర్రాడికి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో ఇలా చేస్తున్నట్లున్నారు. నా అభిప్రాయం ప్రకారం వైభవ్ ఓ తుఫాన్‌లాంటి వాడు. అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వారు ఈరోజు కాకపోయినా రేపైనా కొట్టుకుపోతారు.'అని ఓఝా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్‌కు తుది జట్టులో అవకాశం రాకపోయినా.. సీనియర్ ఆటగాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపైనే ఓఝా ఘాటుగా స్పందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


