Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: ఆమె వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: స్మృతి మంధాన

దీప్తి శర్మ అద్బుతమైన బ్యాటింగ్‌తోనే ఓడిపోయే మ్యాచ్‌లో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. అరంగేట్ర ప్లేయర్ నికీ ప్రసాద్ కూడా అద్భుతంగా ఆడిందని కొనియాడింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది.

ఈ గెలుపుతో స్మృతి మంధాన తన కెప్టెన్సీ ప్రయాణాన్ని ఘనంగా మొదలుపెట్టింది. ఇటీవలే టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా మంధాన ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మృతి మంధాన కెప్టెన్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో తాను చెప్పిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటని చెప్పేందుకు నిరాకరించింది. నందిని శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసిందని కొనియాడింది.

IND vs ZIM: ఆదుకున్న దీప్తి శర్మ.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!

IND vs ZIM: ఆదుకున్న దీప్తి శర్మ.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!

ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేదు..

'మా ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేదు. కానీ విజయం సాధించాం. ఈ రోజు మా ప్లేయర్లలో కొంత మంది ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నందిని శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన తొలి మ్యాచ్‌లోనే నికీ ప్రసాద్ అదరగొట్టింది. దీప్తి శర్మ తనకు అలవాటైన రీతిలోనే ఆడింది. ఆమె నిజంగా ఓ దిగ్గజం. ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక జట్టుగా మేం సరిదిద్దుకోవాల్సిన లోపాలు, నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.

Smriti Mandhana Praises Deepti Sharma and Niki Prasad After India Beat Zimbabwe in 1st T20I

కెప్టెన్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో నేను చెప్పాల్సిన విషయాలు చెప్పాను. వాటిపై పనిచేయడం మొదలు పెట్టాక త్వరలోనే మీకు ఫలితాలు కనిపిస్తాయి. ఆ విషయాలు ఏంటని ఇప్పుడు చెప్పలేను. కానీ వాటిపై మేం బాగా చర్చించాం. ఈ మ్యాచ్‌లో మా సానుకూల అంశాలు ఏంటంటే.. మైదానంలో ఫీల్డింగ్ ఇంటెన్సిటీ చాలా బాగుంది. ముఖ్యంగా వికెట్ల కోసం మా ఫీల్డర్లు డైవ్స్ కూడా చేశారు.

IND vs NZ: న్యూజిలాండ్ టూర్.. భారత వన్డే, టెస్ట్ జట్లను ప్రకటించిన బీసీసీఐ!

Also Read

IND vs NZ: న్యూజిలాండ్ టూర్.. భారత వన్డే, టెస్ట్ జట్లను ప్రకటించిన బీసీసీఐ!

జింబాబ్వే బాగా ఆడింది..

ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా వారి బ్యాటర్లు చక్కని షాట్స్ ఆడారు. ఎప్పుడూ ఆడని కొత్త టీమ్‌తో మ్యాచ్ అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్లు ఎలా ఆడతారో అంచనా వేయలేం. కానీ మ్యాచ్ చివర్లో మా బౌలర్లు పుంజుకొని పిచ్‌కు తగ్గట్లు బౌలింగ్ చేయడం కలిసొచ్చింది.

మ్యాచ్‌కి ముందే మేం వాళ్ల గురించి ప్రణాళికలు రచించాం. కానీ వీడియోల్లో, మైదానంలోని వారి ఆట చాలా తేడాగా ఉంది. దీప్తి శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. బౌలర్లను ఏ మాత్రం సెటిల్ అవ్వనివ్వలేదు. చాలా ధైర్యంగా బ్యాటింగ్ చేసింది. ఆమె బ్యాటింగ్ చూసాక నా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అయ్యింది.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.

Story first published: Saturday, October 17, 2026, 10:25 [IST]
Other articles published on Oct 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+